Varshini Sounderajan Washington Sundar.. సినీ సెలబ్రిటీలూ, క్రికెటర్ల మధ్య ఎఫైర్లు నడవడం.. గాసిప్స్ చక్కర్లు కొట్టడం చాలా చాలా సహజమే. ఎప్పటి నుంచో నడుస్తున్న యవ్వారమిది.
అయితే, కొన్ని రిలేషన్లు టెంపరరీగానే ముగిసిపోతుంటాయ్. విరాట్, అనుష్కల మాదిరి మరికొన్ని రిలేషన్లు ప్రేమ, పెళ్లి అంటూ చిరకాల బంధాలుగా మారుతుంటాయ్.
అయితే, ఇలాంటి చాలా రిలేషన్లు ఒకింత గోప్యంగా నడుస్తుంటాయ్. వాళ్ల వాళ్ల కెరీర్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా జాగ్రత్త పడుతుంటారు ఇరువురు.
Varshini Sounderajan Washington Sundar.. ఎంత ఘాటు ప్రేమయో.!
తాజాగా ఓ యాంకర్‌తో రిలేషన్ కారణంగా పాపం.! ఓ యంగ్ క్రికెటర్ కెరీర్ నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరా క్రికెటర్.? ఎవరా యాంకర్.? ఏంటా కథ.!
క్రికెటర్లు.. అందాల భామలు.. ఇదొక విడదీయరాని బంధం.!
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రముఖ నటి.! చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే.
కొన్ని క్రికెట్ – సినిమా బంధాలు పెళ్ళి పీటలెక్కితే.. కొన్ని, జస్ట్ ‘ఎపైర్’ వరకే పరిమితమయ్యాయ్.!
ఇంతకీ, వర్షిణి – సుందర్ మధ్య ఏముంది.?
Mudra369
యాంకర్ వర్షిణి సౌందర రాజన్‌కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకుందీ అమ్మడు.

సినిమాలపై ఆసక్తితో ఈ మధ్య అడపా దడపా అవకాశాలు కూడా దక్కించుకుంటుందనుకోండి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య యంగ్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో వర్షిణి చెట్టా పట్టాలేసుకు తిరుగుతోందట.
సుందరి మోజులో సుందరుడు.! సీన్ రివర్స్ అయ్యిందే.!
ఈ తిరుగుడు మోజులో పడి, ఈ వాషింగ్టన్ సుందరుడు (Washington Sundar) తన కెరీర్‌కే ఎసరు పెట్టుకున్నాడనీ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో మనోడు కూడా ఆడుతున్నాడు.
Also Read: Guess Who.. విరహ వేదన.! ఇంత అరాచకం తగునా.?
ఐపీఎల్ ఆంక్షల్లో భాగంగా వర్షణితో రిలేషన్, ఈ యంగ్‌స్టర్‌ని ఐపీఎల్ నుంచి పీకి పారేసే వరకూ వచ్చిందని బలంగా ప్రచారం జరుగుతోంది.
నిజంగానే ఆ క్రికెటర్ కెరీర్ వర్షిణి (Varshini Sounderajan) కారణంగా నాశనమైపోయిందా.?
మామూలుగా అయితే, ఈ తరహా పుకార్లు సెలబ్రిటీలకు క్రేజీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుంటాయ్. అదేంటో.! వర్షిణి విషయంలో సీను ఇలా రివర్స్ అయ్యిందేంటి చెప్మా.!