Priya Prakash Varrier Sea.. సింగిల్ నైట్ స్టార్ అయిపోయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఒకే ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే అనూహ్యంగా క్రేజ్ దక్కించుకుంది.
అలా వచ్చిన క్రేజ్‌తో అమ్మడు చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు. కన్ను గీటి కుర్రకారు గుండెకు కోత పెట్టేసింది. దాంతో, వింక్ బ్యూటీగా ఈ ముద్దుగుమ్మ పేరు కొన్నాళ్ల పాటు తెగ మార్మోగిపోయింది.
ఆ ఇమేజ్‌తోనే హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకుంది. తెలుగు విషయానికి వస్తే, బ్యాక్ టు బ్యాక్ నితిన్‌తో రెండు సినిమాల్లో నటించేసింది.
Priya Prakash Varrier Sea.. జెట్ స్పీడులో దూసుకొచ్చినట్లే వచ్చి..
పాపం.! ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసరికి, క్రేజూ లేదూ గ్రీజూ లేదూ వింక్ పిల్లని తెలుగు జనం పట్టించుకోవడం మానేశారు.

ఆ తర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు. కానీ, రీసెంట్‌గా ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు ప్రియా ప్రకాష్ వారియర్.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్రో’ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ ఓ చిన్న రోల్‌లో కనిపించబోతోంది.
చిన్న రోలే కానీ.. ‘పవర్’ ఛాన్స్.!
కేతిక శర్మ ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఫీమేల్ రోల్ పోషిస్తుండగా, ప్రియా ప్రకాష్ వారియర్ ఓ చిన్న పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్‌కి పెయిర్ అట అని కూడా టాక్ నడుస్తోంది. అయితే, అది ఏ తరహా పాత్ర అనేది ‘భ్రో’ రిలీజ్ అయితే కానీ, తెలీదు.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
కాగా, సినిమాల్లో పెద్దగా ఛాన్సుల్లేవ్ కానీ, అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మెరుపు తీగలా కనిపిస్తుంటుంది ప్రియా ప్రకాష్ వారియర్.
తాజాగా నడి సంద్రంలో చేప పిల్లలా ఈత కొడుతున్న ఫోటోల్ని తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసి, ట్రెండింగ్ అయ్యే ప్రయత్నం చేస్తోందీ అమ్మడు.
నిజంగానే ఈ పిక్స్ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ అవుతున్నాయ్. ఏమో, ‘బ్రో’ సినిమాతో పాప దశ తిరిగి మళ్లీ టాలీవుడ్‌లో పాగా వేస్తుందేమో చూడాలి మరి.