Shaitan Hotstar Web Series.. సహజత్వమంటే ఏంటి.? పచ్చిగా బూతులు మాట్లాడెయ్యడం.! పైశాచికత్వాన్ని చూపించడం.! ఇదేనా క్రియేటివిటీ.?
వెబ్ సిరీస్ అంటేనే అంత.! ఔనా.? నిజమా.? అలాగైతే, అస్సలేమాత్రం అసభ్యత, హింసకు తావులేని వెబ్ సిరీస్‌లు కూడా చూస్తున్నాం కదా.?
సినిమాల్లోనూ సాధారణ సినిమాలు, ఛండాలం సినిమాలు ఎలా వుంటాయో.. వెబ్ సిరీస్‌ల వ్యవహారం కూడా అంతే.!
Shaitan Hotstar Web Series.. సైతాన్.. ఇదేం పైశాచికత్వం.?
తెలుగులో ‘సైతాన్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. టాలీవుడ్ దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించాడు. త్వరలో.. అతి త్వరలో ఓటీటీ వీక్షకుల్ని అలరించనుంది.
ట్రెయిలర్ తాజాగా విడుదల చేశారు. ‘సైతాన్’ చూస్తే, ఆ సైతాన్ మీ చుట్టూనే వున్నట్లు అనిపిస్తుంది. అంత దారుణంగా కట్ చేశారు ట్రెయిలర్‌ని.
‘కట్’ చేయడమంటే మామూలుగా కాదు.. బూతులతో నింపేశారు.. రక్తసిక్తం చేసి పడేశారు. సినిమాలోని లేడీ క్యారెక్టర్స్ మాట్లాడే బూతులు మామూలుగా లేవ్.
ఆకాశంలో సగం.. బూతుల్లోనూ సగం.!
ఆకాశంలో సగం.. అన్నింట్లోనూ సగం.. అంటూ మహిళ చైతన్యం గురించి చెబుతుంటాం. మగ నటులేనా బూతులు మాట్లాడేది.? హింసాత్మక చర్యలకు ఒడిగట్టేది.?
మహిళా నటులు కూడా.. అంతకు మించి బూతులు మాట్లాడగలరు.. హింసాత్మకంగా ప్రవర్తించగలరని ‘సైతాన్’ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నారన్నమాట.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ ముద్దు.! దాటేసిందా హద్దు.?
సెన్సార్ వుండదా.? వుండకనేం, వుంటుంది. ‘ఎ’ అని వేసేస్తారు కదా.! థియటర్లలో చూసే సినిమాకి ‘ఎ’ వుంటేనే, పిల్లల్ని ఆపలేకపోతున్నాం.
ఇంట్లోనే, ఓటీటీలో చూసే అవకాశం వున్నప్పుడు, దాన్ని ఎలా ఆపగలం.? మహి వి రాఘవ.. ఏంటయ్యా ఈ పైశాచికత్వం.?
సీనియర్ నటుడు వెంకటేష్ ‘రానా నాయుడు’ చేస్తే, ‘ఛీ ఛండాలం’ అన్నాం. మరి, దీన్నేమనాలి.? ‘ఛండాలం’ అన్న మాట కూడా సిగ్గు పడుతుందేమో ఈ ‘సైతాన్’ని చూస్తే.!
ముందు ముందు.. ఓటీటీ పైత్యం ఇంకెలా మారబోతోందోగానీ.. పిల్లల్ని ఈ ఛండాలం నుంచి కాపాడుకోవడం దాదాపు అసాధ్యం.!