Anasuya Vijay Deverakonda Trolling.. సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండని అనసూయ భరద్వాజ్ టార్గెట్ చేస్తోంది.! అది అందరికీ తెలిసిన విషయమే.
కానీ, ఇంతవరకు విజయ్ దేవరకొండ ఎక్కడా, ఎప్పుడూ అనసూయ భరద్వాజ్ మీద కామెంట్ చేసింది లేదు.! అసలామెను పట్టించుకున్నదే లేదు.!
అయితే, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులు మాత్రం అనసూయని ట్రోల్ చేస్తున్నారు.! ఈ క్రమంలో బూతులు కూడా వాడేస్తున్నారు.
అనసూయ (Anasuya Bharadwaj) కూడా తగ్గడంలేదు, విజయ్ దేవరకొండ మీద సెటైర్లేస్తూ, ‘సోషల్ వార్’ కొనసాగిస్తూనే వుంది.
అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానుల మధ్య.. గత కొంతకాలంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా.
Anasuya Vijay Deverakonda Trolling.. విజయ్ దేవరకొండకి తెలిసే జరుగుతోందా.?
‘విజయ్ దేవరకొండకి తెలిసే ఇదంతా జరుగుతోందని నేను అనుకుంటున్నాను. నన్ను ట్రోల్ చేయడానికి విజయ్‌కి సన్నిహితుడైన ఓ వ్యక్తి ఖర్చు చేస్తున్నాడు’ అంటూ అనసూయ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నాననీ, ఇకపై ఇలాంటి వివాదాలకు దూరంగా వుంటాననీ, విజయ్ దేవరకొండ మీద కామెంట్స్ మానేస్తాననీ అనసూయ చెబుతోంది.

తన తాజా చిత్రం ‘విమానం’ (Vimanam) ప్రమోషన్ల సందర్భంగా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఈ వ్యాఖ్యలు చేసింది.
కాగా, విజయ్ దేవరకొండ ఒకప్పుడు తనకు మంచి స్నేహితుడనీ, ‘అర్జున్ రెడ్డి’ వివాదంతో గ్యాప్ పెరిగిందనీ, ఆ తర్వాత మళ్ళీ వివాదం సద్దుమణిగిందని చెప్పింది అనసూయ.
చిత్రమేంటంటే.. విజయ్ (Vijay Deverakonda) నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించిన విషయాన్నీ అనసూయ ప్రస్తావించింది.
కాంప్రమైజ్.. ఇదేనా పద్ధతి.?
మానసిక ప్రశాంతతను కోరుకుంటే, అసలు ట్రోల్స్ జోలికి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) వెళ్ళకూడదు. ఎందుకంటే, ఆమె ఇతరుల మానసిక ప్రశాంతతనీ దెబ్బ తీస్తున్నట్లే కదా.?
Also Read: మేనేజర్ గ్రేట్.! హీరోగారేమో వరస్ట్.! అంతేనా.?
విజయ్ దేవరకొండ సన్నిహితుడు అనసూయ మీద ట్రోల్ చేయడం కోసం ఖర్చు చేస్తే, అనసూయ.. అతన్ని టార్గెట్ చేయాలి. ఇందులో విజయ్ దేవరకొండకి ఏంటి సంబంధం.?
ట్రోల్ చేసే వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లే, ఆ ట్రోల్స్ కోసం ఖర్చు చేస్తున్నవారిపైనా పోలీసులను ఆశ్రయించొచ్చు. కానీ, అనసూయ అలా ఎందుకు చేయలేదబ్బా.?