Ram Gopal Varma Kelukudu.. రామ్ గోపాల్ వర్మ స్వయం ప్రకటిత మేధావి.! ఔను, తన ట్వీట్లు సామాన్యులకు అర్థం కావనే భ్రమలో వుంటాడు.!
ప్రపంచంలో ఎవడూ మేధావి కాడు.! ఒకడు, ఓ రంగంలో రాణించినంతమాత్రాన, అతను ఆ రంగంలో మేధావి అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
సరే, ఇక్కడ మేధావి – మూర్ఖుడు.. అనే చర్చ పక్కన పెట్టి, ‘కెలకడం’ గురించి మాట్లాడుకుందాం.
Ram Gopal Varma Kelukudu.. ఏంటీ కెలుకుడు రోగం.?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల్ని కెలకడం తనకు సరదా.. అంటూ ఓ ఇంటర్వ్యూలో తాజాగా సెలవిచ్చాడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).
ప్రస్తుతానికైతే రామ్ గోపాల్ వర్మ (RGV) ఓ రాజకీయ పార్టీకి చెందిన మనిషి. సదరు రాజకీయ పార్టీ ఉసిగొల్పితే, ట్వీట్లతోనూ సినిమాలతోనూ మొరగడం ఆర్జీవీ పని.!

అన్నట్టు.. ఆ ఆర్జీవీని (Ram Gopal Varma) ఇంటర్వ్యూ చేసింది కూడా అదే రాజకీయ పార్టీకి చెందిన మనిషే.!
ఇకనేం, ఆ ఇంటర్వ్యూ ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతున్న మీడియా, పాత్రికేయం పేరుతో.. పాత్రికేయ వ్యభిచారం చేస్తోందన్నది బహిరంగ రహస్యం.
కెలికి వాసన చూడటం.!
ఆర్జీవీ మాత్రమే మేధావి అనుకుంటే ఎలా.? ఎవర్నో కెలుకుతున్నానని ఆర్జీవీ భ్రమల్లో వున్నాడు.! కానీ, ఆర్జీవీని సరదాగా కెలికేటోళ్ళు కూడా వున్నారు. అది ఆయనకీ తెలుసు.
ఎవరి కోసమో ఇంకొకరి మీద పడి ఏడవడం వర్మకి అలవాటు. ఈ క్రమంలో వెకిలి సినిమాలు తీస్తాడు, అంతకన్నా వెకిలిగా సోషల్ మీడియాలో సెటైర్లేస్తాడు.
Also Read: సందీప్ రెడ్డి వంగా ‘ANIMAL’.. తెలుగు హీరో అయ్యుంటేనా.!
మరి, అవతలి వ్యక్తుల అభిమానులు ఊరుకుంటారా.? ఆర్జీవీ భాషలోనే ఆర్జీవీకి సమాధానమిస్తారు.
కెలికేశానని ఆర్జీవీ సంతృప్తి పడతాడేమోగానీ, దాన్ని ‘కెలికి వాసన చూసుకోవడం’ అంటారని ఆయనకి తెలియకుండా వుంటుందా.?
ఇప్పుడు చెప్పండి.. కెలకడం అనేది సరదానా.? రోగమా.? కెలికి వాసన చూడటమంటే రోగమే మరి.!