Vijay Kanakamedala Bhairavam Ban.. ‘భైరవం’ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు.
దర్శకుడు విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంలో తెకెక్కి, ఓటీటీలోనూ అందుబాటులో వున్న ‘గరుడన్’కి ఇది తెలుగు రీమేక్.
కమెడియన్ సూరి, పూర్తి మేకోవర్‌తో చేసిన ఎగ్రెసివ్ ఫిలిం ఇది. ఉన్ని ముకుందన్, శశికుమార్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.
Vijay Kanakamedala Bhairavam Ban.. దర్శకుడెప్పుడో చేసిన పాపం.. సినిమాకి శాపం..
దర్శకుడు విజయ్ కనకమేడల, చాలాకాలం క్రితం సగటు సినీ అభిమానిగా వున్నప్పుడు, తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ మార్ఫింగ్ ఫొటో, ఇప్పుడు ‘భైరవం’ సినిమాకి షాకిచ్చింది.
‘బ్యాన్ భైరవం’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. చిరంజీవి, రామ్ చరణ్‌లను మార్ఫ్ చేసిన పోస్ట్ అది.
‘అబ్బే, దాంతో నాకు సంబంధం లేదు.. 2011 నాటి వ్యవహారం. నా సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాక్ అయ్యింది.. నేనెందుకలా చేస్తాను.?’ అంటూ విజయ్ కనకమేడల తాజాగా వివరణ ఇచ్చాడు.
అంతే కాదు, క్షమాపణ చెబుతూ ట్వీటేశాడు కూడా విజయ్ కనకమేడల. ఇక్కడితో, ఈ వివాదం ఆగిందా.? అంటే, ఆగలేదు.. ముదిరి పాకాన పడింది.
వైసీపీ నుంచి బ్యాన్ థ్రెట్స్..
‘భైరవం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో, ‘పదకొండు నెలల క్రితం ఓ మార్పు వచ్చింది..’ అంటూ, విజయ్ కనకమేడల చేసిన కామెంట్, వైసీపీ శ్రేణులకు ఎక్కడో కాలేలా చేసింది.
వైసీపీ ఈ ‘భైరవం’ సినిమాని బ్యాన్ చేసింది.. మెగా ఫ్యాన్స్ కూడా, ‘భైరవం’ సినిమాని బ్యాన్ చేసేశారు. వెరసి, ‘బైరవం’ చిక్కుల్లో పడింది.
Also Read: Maranamass Telugu Review: హాస్యంతో కూడిన బీభత్సం.!
హీరోలు మనోజ్, రోహిత్, శ్రీనివాస్.. ఈ ముగ్గురూ ఫ్లాపుల్లో వున్నవాళ్ళే. ఇప్పుడీ దర్శకుడి తలనొప్పితో, ఆ హీరోలూ తెగ ఇదయిపోతున్నారు.
నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందనేది ఓ సామెత. అలానే, పాత పాపాలు భవిష్యత్తులో శాపాలుగా వెంటాడతాయ్.!