Pawankalyan Varahi Vijaya Yatra జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ చేపట్టారు.!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముగుస్తుంది.
అసలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ‘వారాహి విజయ యాత్ర’ ఎందుకు చేపట్టినట్లు.? ‘వారాహి’ అంటే, ‘పంది’ అనుకునే మూర్ఖులు.. మారతారని మాత్రం కాదు సుమీ.!
Pawankalyan Varahi Vijaya Yatra .. రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకంటే..
రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) ఎందుకొచ్చారు.? ఎందుకంటే, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం.
మా కులపోడు కాబట్టి.. మా మతానికి చెందినోడు కాబట్టి.. పోలింగ్ రోజున ఓటేస్తే డబ్బులిస్తారు కాబట్టి.. ఇలా ఆలోచించే జనంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు.
తన కష్టార్జితాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan).

అందుకే, పవన్ కళ్యాణ్‌ని (Jana Sena Party Chief Pawan Kalyan) రాజకీయ నాయకుడిగా సోకాల్డ్ రాజకీయ నాయకులు గుర్తించడానికి ఇష్టపడటంలేదు.
రాజకీయమంటే, ప్రజాధనాన్ని దోచుకోవడమే.. అని సోకాల్డ్ రాజకీయ నాయకులు బలంగా నమ్ముతుంటారు మరి.! నమ్మడమేంటి.? అదే రాజకీయమనుకుని.. దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
ప్యాకేజీ ఆరోపణల వెనుక..
ప్యాకేజీలకు అమ్ముడుపోయే నాయకుల్ని కొనుక్కోవడం.. ఆ ప్యాకేజీలకు అమ్ముడుపోవడం.. ఇలా ప్యాకేజీలకు అలవాటైపోయినోళ్ళే, పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ’ విమర్శలు చేస్తుంటారు.
ఎవడో ఏదో అన్నాడని, రాజకీయాల్లో తాను చేయాలనుకున్న పనులు చేయకుండా ఆగిపోవడం పవన్ కళ్యాణ్‌కి తెలియదు.
వారాహి విజయ యాత్ర.. తెలుగు నేలపై సరికొత్త రాజకీయం కోసం.!
రాజకీయమంటే, నేరస్తులకు పునరావాస కేంద్రంగా మారిపోయిన ఈ రోజుల్లో స్వచ్ఛ రాజకీయానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్.. చాలామందికి మింగుడు పడకపోవడంలో వింతేముంది.?
Also Read: Free Hindu Temple.! హిందూ దేవాలయాలకి రాజకీయ గ్రహణం.!
కులం పేరుతో.. మతం పేరుతో.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారికి చెంప పెట్టు.. ‘వారాహి విజయ యాత్ర’.!
జనసేన భావజాలం నచ్చిన లక్షలాది మంది యువత.. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ వైపుగా చూస్తున్నారు.. అది జనసేనతోనే సాధ్యమని నమ్ముతున్నారు.
అలాంటి వాళ్ళలో చైతన్యం నింపడం, ‘వారాహి విజయ యాత్ర’ లక్ష్యం.! ట్వీటేస్తే ఐదు రూపాయలు.. అని కక్కుర్తి పడేవాళ్ళకు ఇదెలా అర్థమవుతుంది.?