Ys Sharmila Confusion Politics.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు కొత్త సంకటం వచ్చి పడింది.!
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, తెలంగాణ (Telangana) రాష్ట్రంలోనూ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు.
మహిళా రాజకీయ నాయకుల్లో ఇంకెవరికీ సాధ్యం కాని ‘రేర్ ఫీట్’ పాదయాత్రల విషయంలో వైఎస్ షర్మిల (YS Sharmila) సాధించారన్నది నిర్వివాదాంశం.
Ys Sharmila Confusion Politics.. అన్న తరిమేయడంతో..
వాస్తవానికి, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నుంచి వైఎస్ షర్మిల లోక్ సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు.
అన్న వైఎస్ జగన్ (Ys Jagan Mohan Reddy) స్థాపించిన వైసీపీ కోసం షర్మిల ఎంత కష్టపడ్డా, టిక్కెట్ విషయంలో అన్న నుంచి సానుకూల స్పందన రాబట్టలేకపోయారామె.!

కడప ఎంపీ టిక్కెట్టు విషయమై షర్మిలకు మద్దతుగా మాట్లాడినందుకే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందన్న అభియోగాల్ని స్వయంగా సీబీఐ మోపుతోన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, అన్నతో రాజకీయంగా తెగతెంపులు చేసుకుని, తెలంగాణకు వచ్చేశారు వైఎస్ షర్మిల ( Ys Sharmila).
కుమార్తెకు అండగా వుండే క్రమంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ కూడా రాజీనామా చేసేశారు.!
తెలంగాణలో నిలదొక్కుకోలేక..
తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం నానాటికీ కష్టమైపోతోంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ( Ys Sharmila) కి
.

ఈ నేపథ్యంలోనే, షర్మిల ముందరకు ‘విలీనం’ ప్రతిపాదన వచ్చిందనీ, ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తున్నారనే ప్రచారం షురూ అయ్యింది.
Aslo Read :జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ప్రాణ హాని.? నిజమెంత.!
‘విలీనం ఆలోచనే లేదు.. తెలంగాణ రాజకీయాల్ని దాటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలవైపు చూడటంలేదు..’ అని వైఎస్ షర్మిల ( Ys Sharmila) స్పష్టతనిచ్చారు.
కానీ, నమ్మేదెలా.? తెలంగాణలో ఏం బావుకుందామని రాజకీయాల్లో వైఎస్ షర్మిల ( Ys Sharmila) కొనసాగుతున్నట్టు.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్.!