Bholaa Shankar Teaser Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ టీజర్ వచ్చేసింది.! మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వేదాళం’ సినిమాకి ఇది తెలుగు రీమేక్. ఈ ‘బోళా శంకర్’లో చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోంది.
కీర్తి సురేష్ (Keerthy Suresh) ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి (Mega Star Chiranjeevi) చెల్లెలి పాత్రలో నటిస్తుండడం గమనార్హం.
ఈ పాత్రకి తొలుత సాయి పల్లవిని (Sai Pallavi) అనుకున్నారుగానీ, సాయి పల్లవి ‘రీమేక్’కి ‘నో’ చెప్పడంతో, ఆ ఛాన్స్ కీర్తి సురేష్‌కి దక్కింది.
Bholaa Shankar Teaser Chiranjeevi.. నైజాం కింగ్.. మెగాస్టార్ చిరంజీవి..
బాక్సాఫీస్ లెక్కల పరంగా, నైజాం కింగ్.. అన్న పేరు చిరంజీవితోనే (Mega Star Chiranjeevi) మొదలైంది. ఇప్పుడీ ‘భోళా శంకర్’లో నైజాం సింహంలా కనిపించబోతున్నారు చిరంజీవి.
ఫొటోలో డిజైన్ కనిపిస్తోంది కదా.! వెనకాల సింహం.. ఆపై నడుచుకొస్తున్న మెగా సింహం.! ఇదీ చిరంజీవి ‘భోళా శంకర్’ టీజర్‌లో మెయిన్ హైలైట్.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మార్క్ మాస్ ఎలిమెంట్స్.. మరీ ప్రత్యేకంగా నైజాం స్లాంగ్‌లో కామెడీ.. ఆపై యాక్షన్.. ఈ సినిమాకి హైలైట్ కానున్నాయ్.
Also Read: పూజా హెగ్దే కళ్ళల్లో శ్రీలీల, సంయుక్త.. ‘గుంటూరు కారం’ .!
‘హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్.. 11 ఆగస్ట్ దేఖ్ లేంగే..’ అంటూ చిరంజీవి చెప్పిన ఫైనల్ డైలాగ్.. ఈ టీజర్ మొత్తానికే వెరీ వెరీ స్పెషల్ హైలైట్.!
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.. వాట్ నాట్.. దేనికదే వేరే లెవల్.. అన్నట్టుగా వున్నాయ్.!

చివరగా.. మెగాస్టార్ చిరంజీవి.. (Mega Star Chiranjeevi) రాను రాను మరీ కుర్రాడైపోతున్నాడు.! ఆ స్టైల్.. ఆ మాస్ ఆటిట్యూడ్.. ఆ చమత్కారం.. చిరంజీవి అంటే.. చిరంజీవే మరి.!
ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. మహతీ స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఆగస్ట్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.