Chakravyuham Review.. గొప్పగా వుందని చెప్పలేం.! బాగా లేదని కూడా అనలేం.! ఈ మధ్య వస్తోన్న చాలా సినిమాలతో పోల్చితే, ఇది బెటర్.. అని మాత్రం చెప్పగలం.!
కొద్ది రోజుల క్రితం థియేటర్లలో విడుదలై.. ఈ మధ్యనే ఓటీటీలోకి వచ్చేసిన ‘చక్రవ్యూహమ్’ (Chakravyuham Movie) గురించే ఇదంతా.!
సినిమాలో మనకి తెలిసినోళ్ళంటా నటుడు అజయ్ మాత్రమే. మిగతావాళ్ళంతా కొత్తవాళ్ళే. హీరో ఓకే, హీరోయిన్ కూడా ఓకే.! తాము చెయ్యగలిగినదంతా చేశారు.
సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. క్వాలిటీ పరంగా చూసుకున్నా ఓకే.!
Chakravyuham Review.. కథేంటంటే..
ఓ హత్య జరుగుతుంది. హత్య చేసిందెవరు.? అన్నది కనుక్కోవడానికి రంగంలోకి దిగుతాడు ఓ పోలీస్ అధికారి.
చిక్కుముడి వీడిపోయిందనుకున్న ప్రతిసారీ, కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయ్. భార్యని చంపేసిన భర్త.. అనుకుంటాడు తొలుత పోలీస్ ఆఫీసర్.
అక్కడి నుంచి బోల్డన్ని మలుపులు.! అసలు చంపిందెవరు.? అన్నది తేల్చడమే పోలీస్ అధికారి పని. అదే మిగతా కథ.
చాలా చాలా బెటర్..
ముందే చెప్పుకున్నట్టు.. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలు.. అందులోనూ థ్రిల్లర్స్‌తో పోల్చితే ‘చక్రవ్యూహం’ చాలా చాలా బెటర్.
ఇంకొంచెం క్వాలిటీ వుంటే బావుణ్ణు.. ఇంకొంచెం తెలిసిన స్టార్ కాస్టింగ్ అయితే బావుణ్ణు.. ఇలాంటి మాటలు వినిపించడం సహజమే.
కానీ, తర్వాత ఏం జరుగుతుంది.? అన్న ఉత్కంఠ మొదటి నుంచీ జాగ్రత్తగా క్యారీ చేయగలిగాడు.. ప్రేక్షకుడ్ని ఆ ఉత్కంఠ నడుమ కూర్చోబెట్టగలిగాడు దర్శకుడు.
ఈ విషయంలో దర్శకుడ్ని అభినందించి తీరాలి. అజయ్ ఈ సినిమాకి చాలా పెద్ద అస్సెట్. అయితే, ఇంకాస్త పవర్‌ఫుల్‌గా అతని పాత్రను తీర్చిదిద్ది వుంటే బావుండేది.
Also Read: సిగ్గొదిలేశారు.! ‘సీఎంవో’లో మహిళా జర్నలిస్టుల కొట్లాట.!
హీరో, హీరోయిన్లు బాగానే చేశారని ముందే చెప్పుకున్నాం కదా.! హీరో ఫ్రెండ్‌కి అనవసరమైన బిల్డప్ ఇచ్చినట్లయ్యింది.!
ఆ పాత్ర ఎక్స్ట్రా అనిపిస్తుంటుంది.. నటన పరంగా, స్క్రీన్ స్పేస్ పరంగా.! అనుమానం అటు వైపు వెళ్ళేలా చేయడం కోసమే ఆ పాత్ర అంతే.
శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఓ పాత్రలో కనిపిస్తాడు. అతనికీ సీన్ లేదు. వృధా అయ్యింది ఆ పాత్ర కూడా.!
ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి.. వీలైతే, టైముంటే.. చూడండి. డిజప్పాయింట్ అయ్యే అవకాశమే లేదు. అన్నట్టు, సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ కూడా ఓ చిన్న పాత్రలో మెరిశారండోయ్.!