Kalki Preview.. ‘కల్కి’ మేనియా.! ప్రభాస్‌కి కొత్త కాదు కానీ.!
Prabhas Kalki Preview.. ఎక్కడ చూసినా కల్కి మేనియానే.! అడ్వాన్స్ బుకింగులు అదిరిపోతున్నాయ్.! తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, ‘కల్కి’ సినిమాకి సంబంధించి అదనపు వెసులుబాట్లూ కల్పించాయ్.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, భారతీయ సినీ పరిశ్రమలో ఓపెనింగ్స్ పరంగా తిరుగులేని రికార్డుని ‘కల్కి’ సాధించే అవకాశం వుంది.
అయినా, ప్రభాస్‌కి ఇదేమన్నా కొత్తా.? ‘బాహుబలి’తో మొదలైన ప్రభాస్ మేనియా, ఆ తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా విషయంలోనూ అలాగే కొనసాగుతూ వస్తోంది.
Prabhas Kalki Preview.. ప్రతిసారీ అంతకు మించి..
హిట్టూ.. ఫ్లాపు.. వీటికి అతీతంగా, ప్రభాస్ రేంజ్ నానాటికీ పెరుగుతూ వస్తోంది. ప్రతిసారీ అంతకు మించిన స్థాయి ప్రాజెక్టులే సెట్ అవుతున్నాయ్ ప్రభాస్‌కి.
ఈసారీ అంతే.! హాలీవుడ్.. అంతకు మించి.. అన్నట్లుగానే ‘కల్కి’ సినిమా ప్రమోస్ కనిపిస్తున్నాయ్. ప్రభాస్ అభిమానులే కాదు, సగటు సినీ ప్రేమికుడు ‘కల్కి’ రిలీజ్ కోసం చాలా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం మాయాజాలం చేశాడో.. సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తెరపై ఎలాంటి అద్భుతాలు చేశారోనని ప్రేక్షకులు ఎదురు చూస్తుండడం ఆశ్చర్యకరమేమీ కాదు.
బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పడుకొనే (Deepika Padukone), దిశా పటానీతోపాటు (Disha Patani), మాళవిక నాయర్ (Malvika Nair).. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే.
అన్నిటికీ మించి, ప్రభాస్.. ఈసారి ఏం చేయబోతున్నాడు ‘కల్కి’తో.? అన్నదానిపై అనూహ్యంగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయ్.
ముందస్తు సంబరాలు..
దటీజ్ ప్రభాస్.! ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాల ఫలితాలతో కాస్త డీలా పడ్డ ప్రభాస్ అభిమానులు, ‘సలార్’ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. ఇప్పుడేమో, సంచలనమే.. అంటూ ముందస్తు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం అయితే, ప్రభాస్ కెరీర్‌లోనే ‘కల్కి’ బిగ్గెస్ట్ ఫిలిం అవుతుందని అంటున్నారు.. పోస్ట్ రిలీజ్ రికార్డుల కోణంలో.
Also Read: ఫర్నిచర్ దొంగతనమా.? కోడెలకైనా.. జగన్‌కైనా ఏంటా ఖర్మ.?
తెలుగు సినిమా నిజానికి ఒకింత గందరగోళంలో వుంది. పెద్ద సినిమాలు అనుకున్న సమయానికి రావడంలేదు. చిన్న సినిమాలూ సరైన విజయాల్ని అందుకోలేకపోతున్నాయ్.
ఈ తరుణంలో ప్రభాస్ నుంచి ఓ సెన్సేషనల్ హిట్ ‘కల్కి’ రూపంలో రావాలని యావత్ తెలుగు సినీ పరిశ్రమ కోరుకుంటోంది.