Table of Contents
Bro The Avatar Review.. కొన్ని సినిమాలుంటాయ్.! వీటిని ఏ కోణంలో చూడాలన్నదానిపై కొంత సందిగ్ధం వుంటుంది.!
తమిళంలో సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వినోదయ సితం’. అందులో హీరో వయసు దాదాపు 50 సంవత్సరాలు.! టైమ్ దేవుడి పాత్రలో సముద్రఖని నటించాడు.
తెలుగులోకి ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారనగానే.. అందునా, పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడనగానే.. చాలామంది ఆశ్చర్యపోయారు.
గతంలో ‘గోపాల గోపాల’ సినిమా చేశాడు కదా పవన్ కళ్యాణ్.! దాదాపు అలాంటి సినిమానే ఇది.! కాకపోతే, నేపథ్యం కాస్త భిన్నమైనదంతే.!
సాయి ధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్నారగానే.. విషయం మరింత హాట్ టాపిక్ అయ్యింది. విమర్శలూ ఎక్కువయ్యాయ్.!
సాయి ధరమ్ తేజ్ కోసమే, ప్రధాన పాత్ర తీరు తెన్నుల్ని మార్చాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ దేవుడనగానే.. అదనపు హంగులు తప్పవ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనల మేరకు దర్శకుడు సముద్రఖని ‘బ్రో’ కోసం కొన్ని మార్పులు చేశాడు.
Bro The Avatar Review.. రివ్యూ.. కాస్త ఆలస్యంగా.!
వాస్తవానికి.. సినిమా విడుదలైన రోజునే.. మొదటి ఆటనే చూసెయ్యడం జరిగింది.! కాకపోతే, వ్యక్తిగత కారణాల రీత్యా.. రివ్యూ రాయడానికి సమయం కుదర్లేదు.
ఈలోగా, అనవసర హంగామా షురూ అయ్యింది.! డిజాస్టర్ టాక్‌తో ‘బ్రో’ మొదటి షో పడింది.! ‘పోయిందట కదా..’ అంటూ విదేశాల్లో తొలి ప్రీమియర్ పడక ముందే ప్రచారం మొదలెట్టేశారు.

అది, తెలుగు రాష్ట్రాల్లోనూ అదే విధంగా కొనసాగింది మొదటి షో పడక ముందే.! ఆ తర్వాత అది మరింత పెరిగింది.
కథ చాలా సింపుల్.! యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతాడు మార్కండేయ అలియాస్ మార్క్ (సాయి ధరమ్ తేజ్).
కెరీర్లో సాధించాలనుకున్న పదోన్నతి, చక్కబెట్టాల్సిన కుటుంబ బాధ్యతల కోసం టైమ్ దేవుడి నుంచి 90 రోజుల సమయం పొందుతాడు మార్క్.
ఆ టైమ్ దేవుడు (పవన్ కళ్యాణ్), మార్క్ వెంటే వుంటాడు.. జరుగుతున్నవన్నీ మార్క్‌కి మరింతగా అర్థమయ్యేలా చేస్తాడు.
నువ్వు భూమ్మీద వున్నా.. లేకున్నా.. ఏదీ ఆగదు.! అతిథిలా భూమ్మీదకు వచ్చావ్.. గడువు ముగిశాక.. అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందేనన్నది సినిమా మెయిన్ థీమ్.!
నిజాయితీగా బతికెయ్..
భూమ్మీద వున్నన్నాళ్ళూ నిజాయితీగా బతికెయ్యమంటాడు టైమ్ దేవుడు.! అనవసరంగా టెన్షన్ పడి.. ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దనీ.. ఇతరుల్ని మోసం చేయొద్దనీ క్లాస్ తీసుకుంటాడు.
షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ అంటాం కదా.! అలా, మంచి పాయింట్‌ని చాలా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేశారు.. కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా జోడించారు.
పవన్ కళ్యాణ్ ఇలా చేయడమేంటి.? అనే ప్రశ్నల దగ్గర్నుంచి.. చాలా ప్రశ్నలొచ్చాయ్. కానీ, ఈ సినిమాని ఇంతకన్నా ఇంకెలా తీయగలరు ఎవరైనా.? ఛాన్సే లేదు.
పవన్ కళ్యాణ్ నుంచి ఫైట్స్ ఆశిస్తాం.! కానీ, అలాంటివాటికి చోటివ్వలేదిక్కడ.! పవన్ కల్యాణ్ పాత్ర సందర్భోచితంగా చిన్న చిన్న డాన్స్ మూమెంట్స్ చేస్తుంది.
అంతకు మించి, ఫక్తు కమర్షియల్ సినిమా తరహాలో హీరోయిన్‌తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డ్యూయెట్లు వేసుకోలేదు.
హీరో – హీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్స్, మంచాలు విరగ్గొట్టేసే సన్నివేశాలకు ఆస్కారమే ఇవ్వలేదు. వెకిలి కామెడీ కూడా లేదు.! ఇవన్నీ వుండి వుంటే.. ఇప్పుడు విమర్శిస్తున్న ఆ కొందరికి సినిమా నచ్చి వుండేదేమో.!
మంచి కథని ఎక్కడైనా చెప్పొచ్చు..
ఓ మంచి కథని ఎక్కడైనా ఇంకా బాగా చెప్పాలనే ప్రయత్నం చేస్తాం. రీమేక్, ఒరిజినల్.. అని ఏమీ వుండవ్. అంతా ఒకటే.. అంటాడో యువ దర్శకుడు.
‘బ్రో’ (Bro The Avatar) సినిమా విషయంలోనూ అంతే.! భారీ బడ్జెట్ పెట్టారు.. మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టారు.!
సినిమా నచ్చనివాళ్ళు కాదు.. పవన్ కళ్యాణ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించాలనుకునేవాళ్ళతోనే అసలు సమస్య. వాళ్ళే, ఈ సినిమాపై విషం చిమ్ముతున్నారు.
ఐదు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయిందని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్వయంగా చెప్పాక.. సినిమా ఫలితంపై వెటకారాలు చేయడం.. హాస్యాస్పదం.!
టెక్నికల్ అంశాల విషయానికొస్తే, సినిమాటోగ్రపీ కావొచ్చు, ఎడిటింగ్ కావొచ్చు, విజువల్ ఎపెక్ట్స్ కావొచ్చు.. అన్నీ బావున్నాయ్.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. త్రివిక్రమ్ (Trivikram Srinivas) మార్క్ పంచ్ డైలాగులు ఇంకాస్త గట్టిగా పడి వుంటే, మరింత బావుండేదేమో.!
Bro The Avatar Review.. ఓటీటీలో అయినా.. చూడాల్సిన సినిమా.!
ఓవరాల్‌గా.. ‘బ్రో’ సినిమా చూడాలి.! ఔను, థియేటర్లలో చూడటం ఇష్టం లేకపోతే, ఓటీటీలోకి వచ్చాక అయినా చూడాల్సిన సినిమానే.
ఆల్రెడీ ‘వినోదియ సితం’ చూసేస్తే.. అయినాసరే, ఇంకోసారి ‘బ్రో’ చూడొచ్చు.. తప్పు లేదు.! మంచి విషయమే కదా అక్కడ చెప్పింది.! ఇంకాస్త గట్టిగా బుర్రకెక్కించుకుంటే నష్టమేంటి.?
నువ్వు నీలా బతుకు.! నీ వల్లే ప్రపంచం నడుస్తోందన్న భ్రమల్లోంచి బయటకు రా.! ఇంత చక్కటి సందేశం ఇచ్చిన ‘బ్రో’ సినిమాపై నెగెటివిటీ ఎందుకు.?
నరనరానా జీర్ణించుకుపోయిన నెగెటివిటీ..
చివరగా.. ‘బ్రో’ సినిమా బాగోకపోతే, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులెందుకు ఆ సినిమాకి రివ్యూలిస్తారు.? నెత్తీ నోరూ ఎందుకు బాదుకుంటారు.?
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
పైగా, వసూళ్ళ పేరుతో తప్పుడు లెక్కల్ని మంత్రులెందుకు చెబుతారు.? ఓ సినిమా విషయంలో ఇంతకు ముందెన్నడూ లేనంత హంగామా జరుగుతోందంటే.. అందులో విషయం వుందనే కదా.!
మంచి విషయం.. మంచి మాట.. మంచి సినిమా.. కొందరికి నచ్చకపోవడంలో వింతేమీ లేదు.! నరనరానా నెగెటివిటీని నింపేసుకున్నవాళ్ళకి ‘బ్రో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.!
– yeSBee