Table of Contents
Dayaa Telugu Webseries Review.. అరె.! జేడీ చక్రవర్తి ఏంటి, ఇంత సౌమ్యంగా వున్నాడు.? అస్సలేమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో ఈషా రెబ్బా కనిపించడమేంటి.? ఇలా బోల్డన్ని డౌట్లు.!
‘సేనాపతి’ సినిమా తీసిన పవన్ సాధినేని, ‘దయా’ వెబ్ సిరీస్‌కి దర్శకుడు. సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ సీజన్ ‘దయా’ మంచి మూడ్‌లో నడిచింది. బూతులు దొర్లాయ్.. అడల్ట్ కంటెంట్ అనదగ్గ సీన్స్ ఒకటీ అరా వున్నాయ్. హింస, రక్తపాతం. ఇవీ వున్నాయ్. అందుకే, ‘ఎ’ సర్టిఫికెట్ వేసేశారు.
ఈరోజుల్లో వెబ్ సిరీస్ అంటే.. ఇవన్నీ మామూలేనని అనుకోవాలేమో.! అసలేంటి ‘దయా’ కథ.! అసలు ఎవరు ‘దయా’.! నిండు గర్భిణి పాత్రలో ఈషా రెబ్బా నటించింది.
Dayaa Telugu Webseries Review.. మొహమాటస్తుడైన వ్యాన్ డ్రైవర్ వ్యధ.!
పోర్టు నుంచి ఫిష్ తరలించే ఏసీ వ్యాన్ నడుపుతుంటాడు జేడీ చక్రవర్తి. ఓ డెడ్ బాడీ అతనికి తెలియకుండానే, అతని వ్యాన్‌లోకి వస్తుంది.
సౌమ్యుడు, భయస్తుడైన దయా, ఆ డెడ్‌బాడీని వదిలించుకునేందుకు, తమ్ముళ్ళలాంటి ఇద్దరు స్నేహితుల సాయం తీసుకుంటాడు.
చనిపోయింది ఓ సీనియర్ జర్నలిస్ట్ అని ఆ తర్వాత తేలుతుంది. ఆమెను ఎవరు చంపారు.? అన్నది మిగతా కథ.!
ఇటు జేడీ చక్రవర్తికి, అటు ఈషా రెబ్బాకీ.. ‘భాషా’ లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఏదో వుందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అది రివీల్ చేయలేదు.
బిల్డప్ ఎక్కువైపోయింది..
బిల్డప్ ఎక్కువైపోయి.. విషయం రివీల్ చెయ్యకపోతే, ఎంత నిరాశ వుంటుంది.? సెకెండ్ సీజన్ కోసం ఆ సస్పెన్స్ అలా వుంచాలనుకున్నారేమో. అమ్మాయిలంటే పిచ్చెక్కిపోయే ఎమ్మెల్యే పాత్రలో నటించాడు పృధ్వీ.
జర్నలిస్టు పాత్రలో రమ్య నంబీసన్ నటించింది. ఆ జర్నలిస్టు కవితకి సాయం చేసే మరో జర్నలిస్ట్ విష్ణు ప్రియ.
జోష్ రవి ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అనుకోవచ్చు. చాలా బాగా చేశాడు.

కమల్ కామరాజు పాత్ర విషయంలో కొంత గందరగోళం. కథను మలుపు తిప్పే పాత్రేమో అనిపిస్తుంది. కానీ, చప్పగా వుందీ పాత్ర. కిల్లర్ ఒకడుంటాడు. మాటలు రావతనికి.
నవ్వుతూనే, చంపేసుకుంటూ వెళ్ళిపోతాడు.! ఓవరాల్‌గా గ్రిప్పింగ్‌గానే సాగింది. కానీ, జేడీ చక్రవర్తి అలాగే ఈషా రెబ్బా పాత్రలకి ఇచ్చిన బిల్డప్, వారి నేపథ్యం సస్పెన్స్‌గా వుంచడమొక్కటీ మింగుడుపడదు.
ఇంతకీ ‘దయా’ ఎవరు.?
జేడీ చక్రవర్తి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఈ వెబ్ సిరీస్ మొత్తానికీ హైలైట్. అతని పాత్రకి మొత్తంగా రెండు పేర్లున్నాయ్. ఒకటి ‘దయా’, ఇంకోటి ‘సత్య’. ‘సూర్య’ అనే పేరు కూడా వినిపించింది. అదెవరు.?
Also Read: Divyansha Kaushik.. టక్కర్ పోరీ.. మిర్రర్ గ్లామర్.!
రెండో సీజన్ కోసం చాలా విషయాన్నే దాచినట్టున్నారు.! చాలా ప్రశ్నలే మిగిల్చాడు దయా.! వాటికి సమాధానాలు రెండో సీజన్‌లో దొరుకుతాయా.?
అన్నట్టు, మొన్నీమధ్యనే ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది.
అది జస్ట్ ఛండాలం.. అంతకు మించి.! ఆ ‘సైతాన్’తో పోల్చితే, ఈ ‘దయా’ కొంత దయ చూపించినట్టున్నాడు తెలుగు వెబ్ సిరీస్ లవర్స్ మీద.!