Amerikathalu Telugu NRI Caste కుల జాడ్యం తెలుగు నేలకే పరిమితమని అనుకుంటున్నారా.? అయితే తప్పులో కాలేసినట్టే.! ఈ కుల జాడ్యం.. ఖండాంతరాలు దాటేసింది.!
అమెరికాలో మనోళ్ళ జీవితాలెలా వున్నాయ్.? అన్నదానిపై ‘ఎన్నారై కథలు’ పేరుతో కథనాల్ని ‘ముద్ర’ అందిస్తోంది సమగ్రంగా.! ఇవేవో కల్పిత కథలు కావు.. బాధిత ఎన్నారైల ఆవేదన.!
మొన్నీమధ్యనే సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘తానా’ సభల కోసం అమెరికా వెళితే, అక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య కొట్లాట చూశాం.!
సాటి మనిషికి సాయం చేయడాన్ని మానవత్వం అంటాం.!
మానవత్వం మర్చిపోయి.. కులం, మతం, ప్రాంతమంటూ.. కొట్టుకు ఛస్తోంటే, ఇక మనిషి.. అన్న మాటకి అర్థమేముంది.?
పైగా, విదేశీ గడ్డపైనా కుల జాడ్యం ప్రదర్శిస్తున్నవాళ్ళని అసలు మనుషులుగా కూడా చూడలేం. చచ్చిన శవాల్ని రాబందులో గుంట నక్కలో పీక్కు తింటాయేమో.!
కుల పైత్యంతో బతికుండగానే మనుషుల్ని మానసికంగా పీక్కుతినేవాళ్ళని ఏమనాలి.?
Mudra369
కుల జాడ్యంలోనూ మళ్ళీ వర్గ పోరు.! ఇది కాస్త వెరైటీగా వుంది కదా.! అందుకే మరి, తెలుగోడికి తెలుగోడే శతృవు.. అని అంటున్నది.
అమెరికా గడ్డపై తెలుగు పైత్యం.. నీ కులమేంటి.?
ఎవరైనా తెలుగు నేల నుంచి అమెరికాలో అడుగు పెట్టగానే, వారికి అక్కడున్న ‘కొందరు’ తెలుగువారి నుంచి ఎదురయ్యే తొలి ప్రశ్న, ‘మీ ఇంటి పేరు ఏంటి.?’ అని.
ఇంటి పేరు చెప్పగానే, ‘కులం’ ఏంటన్నది తెలిసిపోతుంది.! ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారు అమెరికాలో అధికం.. తెలుగు నేల నుంచి వెళ్ళినవారిలో. ఈ కుల జాడ్యం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళలో ఇంకా ఎక్కువట.

చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పదోన్నతి విషయంలోనూ, ఈ ‘కులం’ చాలా కీలక పాత్ర పోషిస్తుందట. ‘మన కులపోడికి అధిక రేటింగులు ఇవ్వాలి..’ అని తీర్మానించేసుకుంటారట.
వేరే కులపోడికైతే, రేటింగులు కావాలనే తక్కువ వేసేసి.. నానా రకాలుగా హింసించి.. ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయేలా చేసేసేవాళ్ళూ వున్నారు.
Amerikathalu Telugu NRI Caste.. కులాభిమానం తప్పు కాదు..
కులాభిమానం తప్పు కాకపోవచ్చు. కానీ, కుల జాడ్యం ముమ్మాటికీ మూర్ఖత్వమే.! అది అస్సలు క్షమార్హం కాదు.!
కులాంతర వివాహాలే కాదు, మతాంతర వివాహాలూ ఎడా పెడా జరుగుతున్న రోజులివి. విదేశీయుల్నీ పెళ్ళి చేసేసుకుంటున్నారు తెలుగు జనాలు.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
అలాంటప్పుడు, కులాల పంచాయితీ ఎందుకు.? ఎందుకంటే, అది లేకపోతే.. కొందరికి ఉనికి సాధ్యం కాదు గనుక.
ఆ కొందరి కారణంగా.. మొత్తం అందరికీ చెడ్డ పేరు వస్తోంది. అన్నట్టు, కమ్మ అలాగే రెడ్డి సామాజిక వర్గాల్లోనూ చాలామంది కులాలకతీతంగా ఆలోచించేవాళ్ళున్నారండోయ్.!
కానీ, కడివెడు పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం.. మొత్తం వ్యవహారాన్నే చెడగొడుతుంది కదా.! ఇదీ అంతే.!
మొత్తమ్మీద, ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెడుతున్న యువతని.. ఈ కుల జాడ్యం వేధిస్తుండడం అత్యంత బాధాకరం.