Table of Contents
Happy Independence Day India.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.!
ప్రతి యేడాదీ ఆగస్ట్ పదిహేనో తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం.! జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తుంటాం.
స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. పేదరికం, అణచివేత.. వీటి నుంచి పూర్తిగా మనం బయటపడలేదు.!
ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు సరికొత్త సంస్కరణల్ని తెరపైకి తెస్తున్నా, రోజురోజుకీ ‘అసహనం’ పెరిగిపోతూనే వస్తోంది.
అణచివేతతోనే అసహనం పుట్టుకొస్తుంటుంది. ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు.. ఇప్పుడేమో మన పాలకులు.! ఏ రాయి అయితేనేం, పళ్ళూడగొట్టకోడానికి.. అనే స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది.!
సరే, ఇంత పెద్ద దేశంలో.. ప్రభుత్వాల నిర్ణయాలు అందరికీ నచ్చుతాయని ఎలా అనుకోగలం.? అయినాగానీ, ప్రజాస్వామ్యమంటేనే అది.!
ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం..
ప్రశ్నించేతత్వాన్ని కోల్పోతున్నాం. అదే సమయంలో, అడ్డగోలు వాదనలు పెరిగిపోతున్నాయ్.! పెయిడ్ దుష్ప్రచారాన్ని మనమే పెంచి పోషించుకుంటున్నాం.
వ్యవస్థలో లోటుపాట్లు.. అంటే, ఆ వ్యవస్థలో వున్న ప్రతి ఒక్కరి తప్పిదం. పాలకులు సక్రమంగా పని చేయడంలేదంటే, ప్రశ్నించడం మర్చిపోయిన ప్రజల తప్పే అవుతుంది.
ఒకప్పుడు పెట్రోల్ ధర అర్థ రూపాయ్ పెరిగితే రోడ్డెక్కి ఆందోళనలు చేసిన రోజుల్ని చూశాం. కానీ, ఇప్పుడో.! ఆ పరిస్థితే లేదు.
భాషని చంపేసుకుంటున్నాం.. పరాయి భాష మీద మోజు పెంచుకుంటున్నాం. ఉన్నత చదువులు చదివితే, విదేశాలకు పారిపోవాలనుకుంటున్నాం.!
Happy Independence Day India.. మారాలి.. మారి తీరాలి..
ఒకటా.? రెండా.? తప్పిదాలు చాలానే జరుగుతున్నాయ్.! కాలంతోపాటు మారాల్సిందే.! కానీ, మనుషులమన్న విషయాన్ని మర్చిపోయేంతలా మారిపోవడమే బాధాకరం.!
సొంత పేర్లతో సంక్షేమ పథకాలు.. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు బదులుగా రాజకీయ నాయకుల విగ్రహాలు.! ఇదేం రాజకీయం.? ఇదేం పరిపాలన.?
ప్రజాధనంతో అమలు చేసే సంక్షేమ పథకాలకి రాజకీయ నాయకుల పేర్లేంటి.. సిగ్గు లేకపోతే.! నిలదీయాలి కదా.? సిగ్గులేని రాజకీయాన్ని అగ్గితోని కడిగెయ్యాలి కదా.!
ఎట్టెట్టా.? మాతృభాషలో విద్యనభ్యసించడమంటే… అది దుర్మార్గమా.? తెలుగు వద్దే వద్దు.. ఇంగ్లీషు మాత్రమే ముద్దు.. పరాయి భాష ఇంగ్లీషు వైపు ఆసక్తి చూపడం సుపరిపాలనా.? సిగ్గుండాలి కదా.!
నిలదీయాలి.. యుతరమే ఆ బాధ్యత తీసుకోవాలి.!
సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం.. అంటూ ఓ తెలుగు సినిమా పాటొకటుంది..! అది కూడా నిజమే.!
మారదాం.! ఆలోచిద్దాం.! ప్రశ్నిద్దాం.! ప్రభుత్వలో వున్నవారిని వ్యవస్థలోని లోటుపాట్లపై నిలదీద్దాం.! రాజకీయ అవినీతిని అరికడదాం.! బాధ్యత గల పౌరులుగా నిలబడదాం.!
దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు.! ఆ త్యాగాలు వృధా కాకూడదు.! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటుంటాం.
రాజకీయ అవినీతిని అరికట్టగలిగితే.. ప్రపంచంలోనే, అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యున్నత స్థానంలో నిలబడగలం.!
మనది యువ భారతం.! నవ యువ భారతం.! ఆధునిక భారతం.! అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న భారతం.!
చివరగా.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనో.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనో.. జాతీయ జెండాకి సెల్యూట్ చేసే రాజకీయ నాయకులు, ఆత్మసాక్షిగా ‘మేం అవినీతికి పాల్పడబోం’ అని నినదించగలిగితే, ఆ మాటకు కట్టుబడి వుండగలితే.. జస్ట్ ఐదేళ్ళలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశమైపోతుంది.!
– yeSBee