JrNTR Devara Vs Bhaira.. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న ‘దేవర’ సినిమా నుంచి సైఫ్ అలీఖాన్ లుక్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ పాత్రను పరిచయం చేస్తూ, చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.
సైఫ్ అలీ ఖాన్ పాత్ర పేరు ‘BHAIRA’. దీన్ని ‘భైర’ అని పిలవాలా.? ‘భాయిరా’ అని పిలవాలా.? అన్నదానిపై ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.
‘ఆచార్య’ పరాజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. అలాగే, ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ నుంచి రానున్న సినిమా కూడా ఇదే.
దాంతో, ‘దేవర’పై భారీ అంచనాలతోపాటు, అనుమానాలూ వున్నాయి. ‘దేవర’ నుంచి అప్డేట్.. అంటూ చిత్ర యూనిట్ తొలుత ప్రకటించడంతో, ఆ అప్డేట్ ఏంటా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.
సైఫ్ అలీ ఖాన్ లుక్ రావడంతో.. కాస్త నిట్టూర్చారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు. ఇదేంటి.? ఎన్టీయార్‌లా వున్నాడు.? అంటూ తొలుత అభిమానులే కన్‌ఫ్యూజ్ అయ్యారు.
ఏదిఏమైనా, కొరటాల శివకి ఈ ‘దేవర’ సినిమా సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్.! అలాగే, జూనియర్ ఎన్టీయార్‌కి కూడా.!
జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగులో చేస్తున్న సినిమా ఈ ‘దేవర’.!