Jr NTR Nandamuri Mokshagna.. జూనియర్ ఎన్టీయార్, మోక్షజ్ఞ.. ఇద్దరూ కలిశారు.. కలుసుకున్నారు.. ఆప్యాయంగా కౌగలించుకున్నారు.!
ఫొటోలో కనిపిస్తోంది కదా.. ఆ ఆప్యాయత.! ఇటీవల నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) కుమార్తె సుహాసిని తనయుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఆ వివాహ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు సందడి చేశారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.
Jr NTR Nandamuri Mokshagna.. ఆత్మీయ ఆలింగనం..
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞని (Nandamuri Mokshagna) జూనియర్ ఎన్టీయార్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ ఫొటోనే పైన మీరు చూస్తున్నది.
గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీయార్ అభిమానులకీ, నందమూరి బాలకృష్ణ అభిమానులకీ మధ్య రచ్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా.

మరీ ముఖ్యంగా, టీడీపీకి చెందిన కొందరు నందమూరి బాలకృష్ణ అభిమానులు, జూనియర్ ఎన్టీయార్ని టార్గెట్ చేస్తున్నారు.
అదే సమయంలో, జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) అభిమానులూ కౌంటర్ ఎటాక్ ఇవ్వక తప్పడంలేదు.
ట్రోల్స్ ఇకనైనా ఆగుతాయా.?
అభిమానం ముసుగులో ఇలా ట్రోల్స్ చేసుకోవడం తప్ప.. అసలంటూ ఆ హీరోల మధ్య ఎందుకు గొడవలుంటాయ్.? పైగా, బాబాయ్ – అబ్బాయ్ మధ్యన వివాదాలా.? అన్నది ఇరువురి మ్యూచువల్ అభిమానుల ప్రశ్న.
నందమూరి తారకరత్న దశదిన కర్మ సమయంలో, జూనియర్ ఎన్టీయార్ని బాలయ్య (Nandamuri Balakrishna) పట్టించుకోలదంటూ ప్రచారం జరిగింది. అందులో నిజానిజాలేంటన్నవి ఆ ఇద్దరికే తెలుసు.
Also Read: మూసుకుని చూడాల్సిందే! ‘చిరు’పై విజయ్ ‘మెగా’ కామెంట్స్!
మొత్తమ్మీద, మోక్షజ్ఞ – ఎన్టీయార్ ఆప్యాయ ఆలింగనం.. అన్ని రూమర్లకీ చెక్ పెట్టినట్లయ్యింది.! త్వరలో మోక్షజ్ఞ తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.
బాలకృష్ణ, ఎన్టీయార్ మధ్యనే కాదు.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మధ్య కూడా పంచాయితీలు పెట్టే దురభిమానులున్నారు.!
కాదేదీ, ట్రోలింగుకి అనర్హం. చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించే దురభిమానుల సంగతి సరే సరి. ఇలాంటోళ్ళని అభిమానులని అనగలమా.?