Pawan Kalyan Visakhapatnam Loksabha.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారన్న ప్రచారం తెరపైకొచ్చింది.
విశాఖ ఎంపీ.. అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ సీట్.! బీజేపీ కూడా ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు కూడా ఇదే స్థానంపై ఆశలు పెట్టుకున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ విశాఖ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఎంవీవీ సత్యనారాయణ ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగి, విజయం సాధించారు. అయితే, ఎంవీవీపై ప్రస్తుతం తీవ్ర ఆరోపణలున్నాయి విశాఖలో.
Pawan Kalyan Visakhapatnam Loksabha.. వారాహి విజయ యాత్రతో మారిన సీన్..
విశాఖలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర బంపర్ హిట్ అయ్యింది.
అంతకు ముందు, విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటనకు వైసీపీ సర్కారు కలిగించిన ఆటంకాల నేపథ్యంలో, జనసేనానిపై సింపతీ వేవ్ అనూహ్యంగా కనిపిస్తోందక్కడ.

గత కొన్నేళ్ళుగా విశాఖలో భూముల కబ్జా అంశం, స్థానిక ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతోంది. వైసీపీ హయాంలో ఈ అంశం మరింత తీవ్రమైంది. భూ కబ్జాల వ్యవహారాన్ని జనసేన సమర్థవంతంగా వెలుగులోకి తెస్తున్న సంగతి తెలిసిందే.
గాజువాక నుంచి గతంలో పోటీ చేసి, పవన్ కళ్యాణ్ ఓడిపోయిన దరిమిలా, ఆ సింపతీ కూడా విశాఖ ప్రజల్లో పవన్ కళ్యాణ్ మీద స్పష్టంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ వద్దు.. లోక్ సభ ముద్దు..
గాజువాక అసెంబ్లీ సిగ్మెంట్ కంటే, విశాఖ లోక్ సభ సెగ్మెంట్ మరింత ఎఫెక్టివ్‌గా వుంటుందని.. స్థానికంగా జనసేనాని పట్ల సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ జనసేనాని విశాఖ ఎంపీగా పోటీ చేస్తే, ఆ ప్రభావం ఆ సిగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపైనా సానుకూలంగా వుండొచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
Also Read: కర్ర పెత్తనం.! ‘పులి’ రాజా.. పారిపో.!
ఇంతకీ, ఈ విషయమై జనసేనాని ఆలోచనలు ఎలా వున్నాయ్.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
చివరగా.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల్ని రియల్ ఎస్టేట్ మాఫియా కిడ్నాప్ చేయడంతో, ఎంపీకే భద్రత లేనప్పుడు, వైసీపీ హయాంలో తమకెలా భద్రత వుంటుందని విశాఖ ప్రజలు ఆందోళన చెందడంలో వింతేముంది.?