Table of Contents
Serious Politician Kavitha Kalvakuntla.. సీరియస్ పొలిటీషియన్ కవిత, సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా.? తన పొలిటికల్ కెరీర్‌కి స్వయంగా తానే ముగింపు పలుకుతున్నారా.?
తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది.? తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా మారిన రాజకీయ ప్రయాణంలో కారు పార్టీ భవిష్యత్ ఏంటి.?
తండ్రి కేసీయార్‌కి వ్యతిరేకంగా కవిత గళం విప్పుతున్నారా.? సోదరుడితో రాజకీయ కుంపటి వల్ల వేరు కుంపటి దిశగా కవిత వ్యూహ రచన చేస్తున్నారా.?
బోల్డన్ని ప్రశ్నలున్నాయ్.! సమాధానాలు దొరకడానికి కాస్త సమయం పడుతోంది. కీలక నిర్ణయం దిశగా, కవిత ముందడుగు అయితే వేసేసినట్లే వున్నారు.
Serious Politician Kavitha Kalvakuntla.. కామెడీ కాదు, సీరియస్.!
కొన్నాళ్ళ క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే, ‘ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు’ అంటూ కవిత, తేలిక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిదే.
జన సేన అనే పార్టీని స్థాపించి, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాక కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిలబడ్డారు.. ఏపీ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు.
మరెలా, పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, కవిత స్టేట్మెంట్ ఇవ్వగలిగారు.? అసలంటూ, రాజకీయాలపై కవితకి వున్న ‘సీరియస్‌నెస్’ ఏంటి.?
తెలంగాణలో గులాబీ పార్టీకి పాతర..
గులాబీ పార్టీలో వుంటే, కవితకి రాజకీయ భవిష్యత్తు వుంటుంది. అసలంటూ కవితకి రాజకీయ గుర్తింపే, ఆమె తండ్రి స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా.
జాగృతి పేరుతో కవిత రాజకీయం చేసినా, బతుకమ్మ పేరుతో హడావిడి చేసినా.. అదంతా, తెలంగాణ రాష్ట్ర సమితి పొలిటికల్ గేమ్‌లో భాగమే.
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా, భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయింది. జాతీయ రాజకీయాలపై ‘ఆశ’తో, తెలంగాణలో పార్టీని పాతరేశారు కేసీయార్.
సొంత కుంపటి?
ఇప్పుడేమో, కవిత సొంత కుంపటి దిశగా అడుగులేస్తున్నారు. కొత్త పార్టీ పెడతారా.? కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తారా.? అబ్బే, అదంతా ఫేక్.. అని కవిత బుకాయిస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: సమీక్ష ‘ఓదెల-2’: ఓటీటీలో ఉచితమే అయినా, టైమ్ వేస్ట్!
తనను తాను సీరియస్ పొలిటీషియన్.. అని కవిత అనుకోవచ్చుగాక.! కానీ, ఆమె సిల్లీ పొలిటీషియన్‌గా మారిపోయారిప్పుడు.. తండ్రికి రాస్తున్న లేఖాస్త్రాలతో.!
రేపో మాపో, గులాబీ పార్టీ నుంచి కవితని గెంటేస్తున్నట్లు ప్రకటన కుటుంబ సభ్యులైన కేసీయార్, కేటీయార్ నుంచే రావొచ్చేమో కవితకి వ్యతిరేకంగా.! కామెడీ కాదు, సీరియస్.!