Vijay Deverakonda Secret Marriage.. విజయ్ దేవరకొండ అంటే, యూత్ ఐకాన్.! అలా భావించే యూత్ తెలుగునాట బోల్డంతమంది కనిపిస్తారు.!
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకి వచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. అదింకా అలాగే కొనసాగుతోంది.!
ఇంతకీ, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పెళ్ళెప్పుడు.? నిజానికి, గాసిప్పుల్లో విజయ్ దేవరకొండకి చాలాసార్లు పెళ్ళయిపోయింది.
కొన్ని సార్లు రష్మిక మండన్న (Rashmika Madanna)తో.. ఇంకొన్నిసార్లు సమంత (Samantha Ruth Prabhu)తో విజయ్ దేవరకొండకి పెళ్ళి చేసేశారు చాలామంది గాసిప్పులు రాసేవాళ్ళు.!
Vijay Deverakonda Secret Marriage.. సీక్రెట్ మ్యారేజ్..
పెళ్ళి గురించి ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనా లేదంటున్న విజయ్ దేవరకొండ, హంగామా లేకుండా రహస్యంగా పెళ్ళి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.

‘ఎవరకీ చెప్పకుండా పెళ్ళి చేసుకుంటాను ఒక వేళ పెళ్ళి చేసుకోవాల్సి వస్తే.. పెళ్ళి చేసుకున్నాక, ఎలాగూ చెప్పాలి కదా..’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు.
‘ఖుషీ’ (Kushi) సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సమంత ఈ సినిమాలో హీరోయిన్.
అర్జున్ రెడ్డి కాంబో రిపీట్..
కాగా, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేస్తానని విజయ్ దేవరకొండ చెప్పాడు. ఆ కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ కూడా వెళ్ళడించింది.
ఓ సినిమాకి దర్శకత్వం వహించాలని వుందంటున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమయం దొరికితే ఆర్కిటెక్చర్ చేయాలని వుందనీ వ్యాఖ్యానించాడు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘Hungry Cheetah’.! ఏం చేసేస్తున్నావ్ సుజీత్.!
కాగా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోననీ, సక్సెస్ కోసం ప్రయత్నిస్తాననీ, సినీ రంగంలో సక్సెస్, ఫెయిల్యూర్.. కామన్ అనీ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అంటున్నాడు.
‘లైగర్’ సినిమాకి ముందు.. ‘లైగర్’ (Liger Movie) సినిమా తర్వాత.. ఇదీ విజయ్ దేవరకొండ పరిస్థితి.! అన్ని లెక్కలూ ‘ఖుషి’ సినిమాతో మారిపోతాయనే ధీమాతో వున్నాడు విజయ్ దేవరకొండ.