Divya Spandana Death Rumors.. పుట్టిన మనిషి చావాల్సిందే.! ఏ జీవికి అయినా మరణం తప్పదు.! అందరికీ తెలిసిన విషయమే ఇది.! కానీ, ‘చావు’ వార్తలకి వున్న గిరాకీ అంతా ఇంతా కాదు.!
మీడియా పర్సనాలిటీస్ కూడా చావుకి అతీతం ఏమీ కాదు కదా.! అలాంటప్పుడు, చావు వార్తల విషయంలో ఎందుకు సంయమనం పాటించరు.?
ఇది కలికాలం.! అంతకు మించి, సోషల్ మీడియా కాలం.! దీన్ని పోయేకాలం అని కూడా అనొచ్చు.!
Divya Spandana Death Rumors.. దివ్య స్పందనని చంపేశారు.!
ప్రముఖ నటి దివ్య స్పందనని సోషల్ మీడియా వేదికగా చంపేశారు కొందరు. ఎందుకు.? అంటే, ఏమో.. ఈ ప్రశ్నకి ఇంకా సమాధానం తెలియాల్సి వుంది.
తెలుగులోనూ ఒకటీ అరా సినిమాల్లో దివ్య స్పందన నటించింది. ‘రమ్య’ అన్న పేరుతోనూ ఆమె సినిమాలు చేసింది.
నటిగా మంచి పేరే తెచ్చుకుంది. ఎక్కువగా కన్నడ సినిమాల్లో నటించింది. కన్నడ భామ ఈ దివ్య స్పందన.. తమిళ సినిమాల్లో కూడా కనిపించింది.
రాజకీయమే శాపమై..
చాలా చిన్న వయసులోనే, అనూహ్యంగా ఆమె లోక్ సభకి ఎంపికైంది. కానీ, తక్కువ కాలంలోనే ఆమె ఆ పదవికి దూరమయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.
ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దివ్య స్పందన అలియాస్ రమ్య దూరంగా వున్నారు. రాజకీయమే, ఆమె ‘డెత్ గాసిప్స్’కి కారణమా.? అంటే, ఔననే చెప్పాలేమో.!
దివ్య స్పందన గుండె పోటుతో హఠాన్మరణం చెందినట్లు కొందరు సోషల్ మీడియా వేదికగా రూమర్స్ క్రియేట్ చేస్తే, అదంతా ఫేక్.. అని కాస్సేపటికే తేలిపోయింది.
Also Read: శివ శివా.! పిచ్చి కాకపోతే.. ‘ఖుషీ’లో కాశ్మీర్ పైత్యమెందుకు!
‘చావు గాసిప్స్’ని ప్రచారం చేస్తున్నోళ్ళకీ ఖచ్చితంగా చావు వస్తుంది.! మరణం, వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు.. ఓ కుటుంబానికి అత్యంత బాధాకరమైనది కూడా.!
చావు మీద గాలి వార్తలు పోగేసే స్థాయికి మీడియా దిగజారిపోవడం అత్యంత హేయం.! మనిషిని మనిషి బతికుండగానే పీక్కు తినడమే ఇది.! ఔను, ఇది ముమ్మాటికీ నరరూప రాక్షసత్వమే.!