Mega Heroine Mrunal Thakur.. మెగా ఛాన్స్ కొట్టేసిందట మృణాల్ ఠాకూర్.. అనే వార్త ఇప్పుడు మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఓహ్.! మెగా ఛాన్స్ అంటే రామ్ చరణ్ సరసనో, వరుణ్, సాయి తేజ్ సరసనో లేదంటే వైష్ణవ్ తేజ్ పక్కనో ఛాన్స్ కొట్టి వుండొచ్చు.. అనుకుంటారేమో.
అలా అనుకుంటే, తప్పులో కాలేసినట్లే.! ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన మృణాల్ ఠాకూర్ ఛాన్స్ కొట్టేసిందట. కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇదే టాక్ ఇప్పుడు స్వైర విహారం చేస్తోంది.
దీంతో సోషల్ మీడియా అంతా మృణాల్ (Mrunal Thakur) పై నెగిటివ్ ప్రచారంతో దుమ్మెత్తిపోస్తోంది. తండ్రి వయసున్న హీరోతో నటించేస్తావా.?
Mega Heroine Mrunal Thakur.. ఆమె చేస్తే లేని అబ్జెక్షన్ ఈమె చేస్తే వచ్చిందా.!
అవకాశాల కోసం ఇంతలా దిగజారిపోవాలా.? యంగ్ హీరోల సరసన ఆఫర్లు బాగానే వస్తున్నాయ్‌గా.. వయసుకు తగ్గ ఆలోచనలు చేయాలి కానీ, అత్యాశ కూడదు సుమా.! అంటూ మృణాల్‌ని (Mrunal Thakur) తిట్టిపోస్తున్నారు నెటిజనం.
అయినా, అదేమంత తప్పేంటట.! చిరంజీవి సరసన శృతి హాసన్ (Sruti Haasan) చేసినప్పుడు లేని అభ్యంతరాలు.. ఇప్పుడు మృణాల్ (Mrunal Thakur) నటిస్తే ఎందుకొస్తున్నాయట.!

అయినా నటనకు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఇంతకీ ఇంతలా ప్రచారం జరుగుతోన్న చిరంజీవి (MegaStar Chiranjeevi) ఆ సినిమా ఏంటా.? అంటే.. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తన్న సంగతి తెలిసిందే.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ లోపు హీరోయిన్ విషయమై మృణాల్ పేరు తెర పైకి వచ్చి ఇదిగో ఇలా అనవసరమైన రచ్చరంభోలా చేస్తోంది.

ఇదిలా వుంటే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అసలు ఈ సినిమాలో చిరంజీవికి హీరోయినే వుండదంటున్నారు.
Also Read : Vijay Deverakonda: సాయం చేసే చేతుల్ని నరికేస్తారా.?
ఇదో సీరియస్ సస్పెన్స్ డ్రామా అని తెలుస్తోంది. హీరోయిన్‌తో పాటలూ, డాన్సులూ వుండే అవకాశమే లేదంటున్నారు.