Janasena Glass Pawan Kalyan.. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఏ గుర్తుకి ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించాలి.? ఈ విషయమై బోల్డంత కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశారు జనసేన రాజకీయ ప్రత్యర్థులు.
స్వయం ప్రకటిత మేధావులు కూడా జనసేన ఎన్నికల గుర్తు ‘గ్లాసు’ మీద నానా రకాల ‘పెయిడ్’ విమర్శలూ చేశారు. అంతలా వాళ్ళంతా అమ్ముడుపోయి విశ్లేషణలు చేయడం చూశాం.
అయితే, మొదటి నుంచీ జనసేన పార్టీ ‘గ్లాసు’ విషయమై పూర్తి స్పష్టతో వుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు, ‘గ్లాసు’ గుర్తు విషయమై కొన్ని ఇబ్బందులు జనసేన పార్టీకి వున్నాయన్నది నిర్వివాదాంశం.
అదే సమయంలో, ఆ ఇబ్బందుల్ని అధిగమించగల స్థాయిలో జనసేన పార్టీ లీగల్ విభాగం తనవంతుగా కష్టపడుతూనే వుంది.
ఎలాగైతేనేం, అన్ని అనుమానాలూ పటాపంచలు చేస్తూ, ‘గ్లాసు’ గుర్తుకే ఓటెయ్యాలంటూ జనసేన పార్టీ, బల్లగుద్ది మరీ తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది.
రాజకీయ ప్రత్యర్థులకీ ఈ విషయమై స్పష్టమైన సమాధానం చెప్పినట్లయ్యింది జనసేన పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం, వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ని యధాతథంగానే కేటాయించిందని జనసేన పార్టీ పేర్కొంది.
గతంలో, ప్రజారాజ్యం పార్టీ సమయంలోనూ చిరంజీవికి ఎన్నికల గుర్తు విషయమై ఇబ్బందులు తలెత్తిన విషయం విదితమే.
‘మార్పు కోసం కొత్త ప్రయత్నం’ కొందరికి ఎప్పుడూ మింగుడు పడదు. అదే అసలు సమస్య. ఆ మార్పు కోసం ప్రయత్నించేవారికి మోకాలడ్డటమే ా కొందరి పని.