Adah Sharma Bastar.. బస్తర్ తెలుసు కదా.? ఆ పేరు చెప్పగానే నక్సలిజం గుర్తుకొస్తుంది.! ఆ ప్రాంతం అంతలా నక్సల్ ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్.!
నక్సల్స్ వర్సెస్ పోలీసులు.. ఎన్నో ప్రాణాలు పోయాయ్.. పోతూనే వున్నాయ్.! ఇరువైపులా ప్రాణ నష్టం.. ఆపై సామాన్యుల ప్రాణాలూ పోయాయ్.. పోతూనే వున్నాయ్.!
‘ది కేరళ ఫైల్స్’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆదా శర్మ, ఈసారి ‘బస్తర్’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది.
‘బస్తర్’ – ది నక్సల్ స్టోరీ.. అంటూ, ‘ది కేరళ ఫైల్స్’ మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Adah Sharma Bastar.. హార్ట్ ఎటాక్..
ఆదా శర్మ తొలి తెలుగు సినిమా ‘హార్ట్ ఎటాక్’. నితిన్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
‘హార్ట్ ఎటాక్’ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినా, ఆదా శర్మ సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.
కానీ, ‘ది కేరళ ఫైల్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఆదా శర్మ పేరు మార్మోగిపోయింది. ఈ క్రమంలో ఆమె కొన్ని బెదిరింపుల్నీ ఎదుర్కొంది.
ఈసారి అంతకు మించి..
ఈసారి అంతకు మించి.. అంటోంది ఆదా శర్మ ‘బస్తర్’ సినిమా గురించి మాట్లాడుతూ, ‘ది కేరళ ఫైల్స్’ తరహాలోనే, ‘బస్తర్’ కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని చెబుతోంది.
షూటింగ్ స్పాట్ నుంచి ఆదా శర్మ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.!
ఆదా శర్మ మల్టీ టాలెంటెడ్. సింగింగ్ టాలెంట్‌తోపాటు, మార్షల్ ఆర్ట్స్‌లోనూ మంచి ప్రావీణ్యమే వుంది ఈ బ్యూటీకి.