Super Star Nayanthara Warning.. నయనతార అంటే, లేడీ సూపర్ స్టార్.! ఒకప్పుడు ఈ గుర్తింపు, గౌరవం.. ప్రముఖ నటి విజయశాంతికి వుండేది.!
తెలుగుతోపాటు వివిధ భాషల్లో నటించిన విజయశాంతిని లేడీ అమితాబ్ బచ్చన్.. అని కూడా అనేవారు. ఆ తర్వాత ఆ స్థాయి ఇమేజ్ ఇంకెవరికీ రాలేదనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
అయితే, ఇప్పుడు మాత్రం, నయనతారని అందరూ ‘లేడీ సూపర్ స్టార్’ అనే పిలుస్తున్నారు.
తమిళం, తెలుగు సహా పలు భాషల్లో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది నయనతార.
Super Star Nayanthara Warning.. తిట్టొద్దంటోందేంటీ.?
లేడీ సూపర్ స్టార్.. అని పిలిస్తే, నయనతారకి అస్సలు నచ్చదట. అలా అని ఎవరైనా అంటే, తనను తిట్టినట్లు వుంటుందని నయనతార వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
‘నన్ను అభిమానించేవారు అలా అనడం ఒకింత ఆనందంగానే వుంటుంది. అదే సమయంలో, ఆ పిలుపు నాకు నచ్చదు. నన్ను తిట్టినట్లు భావిస్తాను..’ అంటూ పరస్పర భిన్నమైన వ్యాఖ్యలు చేసింది నయనతార.
నయనతార వ్యాఖ్యలపై ఆమె అభిమానులకి ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు.
తప్పేముంది.?
లేడీ సూపర్ స్టార్.. అని పిలిస్తే తప్పేంటి.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. తమిళనాట సూపర్ స్టార్ అంటే రజనీకాంత్. తెలుగులో మహేష్‌బాబు.!
జెండ్ సూపర్ స్టార్.. మేల్ సూపర్ స్టార్.. అని హీరోల గురించి పిలవనప్పుడు, లేడీ సూపర్ స్టార్ అని హీరోయిన్లను పిలవడమేంటి.? అన్నది కొందరి వాదన.
ఎవరి గోల వారిది.!