Table of Contents
Hanuman Teja Sajja Range.. ‘హనుమాన్’ పేరుతో ఓ సినిమా రాబోతోంది.! ‘హను-మ్యాన్’ అని అర్థం వచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు.!
అందరికీ తెలిసిన విషయమే.. హనుమంతుడంటే అతి బలవంతుడు.! మరి, తేజ సజ్జ లాంటి యంగ్ హీరో ఈ సినిమా చేస్తే ఎలా.?
ఓ ఎర్నలిస్టు.. అదేనండీ, ఓ సినీ జర్నలిస్టుకీ ఈ డౌటే వచ్చింది.! సరాసరి ఇదే ప్రశ్న, ‘హను-మాన్’ ప్రెస్‌మీట్‌లో హీరో తేజ సజ్జని అడిగేశాడు.
వాళ్ళని అలా అడగగలరా.?
చిన్నప్పటినుంచీ సినీ పరిశ్రమలోనే వుండి, కష్టపడి ఎదిగి.. ఇప్పుడు ఈ అవకాశం నాకు వస్తే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని చెప్పాడు తేజ సజ్జా.
నన్ను, నా స్థాయి గురించి అడుగుతున్నారు.. ఇదే ప్రశ్న, స్టార్ హీరోల వారసుల్ని మీరు అడగగలరా.? అంటూ తేజ సజ్జా సదరు ఎర్నలిస్టుని ఎదురు ప్రశ్నించాడు.
నిజమే కదా.? సినిమా ఎలా వుంటుందో పూర్తిగా తెలియకుండా, స్థాయి గురించి మాట్లాడటమేంటి.? ఆ మాత్రం ఇంగితం లేనోళ్ళు సినీ జర్నలిస్టులుగా చెలామణీ అయిపోతున్నారు.
Hanuman Teja Sajja Range.. ట్రైలర్ అదిరింది..
నిజంగానే ‘హను-మాన్’ ట్రైలర్ అదిరింది.! విజువల్స్ బావున్నాయి. తేజ సజ్జ బాగా చేశాడు. తెరపై అద్భుతాలే చేసేసినట్లు అనిపిస్తోంది.
చిన్నా.. పెద్దా.. అన్న తేడాలుండవ్ సినిమా అన్నాక.! ప్రేక్షకులకు నచ్చితే పెద్ద సినిమా, నచ్చకపోతే.. ఫ్లాప్ సినిమా.. అంతే తేడా.!
Also Read: ‘బంగారం’ లాంటి భామ.! ఇలా మారిపోయిందేంటి చెప్మా.!
ఓపెనింగ్స్ వరకే పెద్ద.. చిన్న.. అన్న ప్రస్తావనలు సినిమాకైనా, హీరోలకైనా.! చివరికి కంటెంటే, ప్రేక్షకుల్ని అలరించాలి.
సంక్రాంతి పోటీ..
సంక్రాంతికి పెద్ద సినిమాలు చాలానే వస్తున్నాయ్. వాటిని తట్టుకుని ‘హను-మాన్’ ఎంతవరకు నిలబడుతుంది.? అన్న డౌటానుమానాలు కొందరిలో వున్నాయ్.
కాగా, మహేష్ సినిమా ‘గుంటూరు కారం’ కూడా సంక్రాంతికే వస్తోంది. మహేష్‌కి తమకూ అభిమానమేననీ, ముందే తమ సినిమా రిలీజ్ డేట్ ఖరారయ్యిందనీ, అందుకే ఇప్పుడు వెనక్కి వెళ్ళలేమని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతుండడం గమనార్హం.
కానీ, హనుమంతుడి కంటే పెద్ద హీరో ఎవరుంటారు.? అనేస్తోంది చిత్ర యూనిట్.!