Niharika What The Fish.. మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల.. కాస్త డోసు పెంచినట్టే వుంది కదూ.! అసలు ఈ గ్లామర్ వెనుక కథేంటి.? ‘వాట్ ది ఫిష్’ ఏంటి.?
అసలు విషయానికి వస్తే, నిహారిక కొణిదెల మళ్లీ సినిమాల్లోకి వస్తుందట.. అంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అందుకు సాక్ష్యమే ఈ తాజా లుక్. ‘వాట్ ద ఫిష్’ అనే సినిమాలో నిహారిక నటిస్తోంది. మంచు మనోజ్ హీరోగా రూపొందుతోన్న సినిమా ఇది. అప్పుడెప్పుడో అనౌన్స్ చేశారు.
Niharika What The Fish.. నిహారిక అల్టిమేట్ గ్లామర్.!
ఈ సినిమా కథా, కమామిషు ఏంటనేది.. తెలీదు కానీ, గతంలోనే ఈ సినిమాకి సంబంధించి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ, అందులోనూ ఏమీ హింట్ ఇవ్వలేదు.
మంచు మనోజ్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడిన గ్లింప్స్ అది. తాజాగా నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను కన్‌ఫామ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో నిహారిక గతంలో ఎన్నడూ లేని విధంగా అల్టిమేట్ గ్లామర్‌గా కనిపిస్తోంది. వైట్ కలర్ షార్ట్ అండ్ హాట్ కాస్ట్యూమ్‌లో చాలా ఇంటెన్సింగ్‌గా అంతకు మించి స్టైలిష్‌గా కనిపిస్తోంది.
సెకండ్ ఇన్నింగ్స్.. నిహారికా.. వాట్ ది సస్పెన్స్.!
మంచు మనోజ్‌కి, ఈ సినిమాలో నిహారిక జంటగా నటిస్తోందా.? అంటే ఏమో తెలీదు కానీ, కొత్త డైరెక్టర్ వరుణ్ కోరుకొండ ఈ సినిమాని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నాడని తెలియ వస్తోంది.
గతంలో పలు చిత్రాలతో హీరోయిన్‌గా ప్రయోగాలు చేసిన నిహారిక, ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి, విడాకులు.. అంటూ వార్తల్లో సంచలనంగా నిలిచింది.
ఇదిగో ఇప్పుడే మళ్లీ సినిమాలంటూ ఇలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సారైనా ఆశించిన హిట్ దక్కుతుందా.? మెగా ప్రిన్సెస్‌కి. చూడాలిక.!