Table of Contents
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకొస్తున్నాడు ‘అరవింద సమేత’ సినిమాతో. హిట్టు మీద హిట్టు కొడుతూ మంచి జోరు మీదున్న ఈ యంగ్ టైగర్, తన పేరిట సరికొత్త రికార్డుని రాసుకునేందుకు ‘అరవింద సమేత’ అంటూ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు. అభిమానుల కోసం ఈ విజయదశమి పండక్కి.. వారం రోజుల ముందే సంబరాలు మోసుకొచ్చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇంతకీ, ‘అరవింద సమేత’ ఎలా వుండబోతోంది.? ఈ ఉత్కంఠ యంగ్ టైగర్ అభిమానుల్లోనే కాదు, సగటు సినీ అభిమానుల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపబోతోంది. ఫ్యాక్షన్ సినిమాలు యంగ్ టైగర్‌కి కొత్త కాదు. అయితే, ఈ సినిమా ఇంకాస్త డిఫరెంట్‌గా వుండబోతోంది. ఎందుకంటే, ఇది ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతోంది మరి.
అసలు ‘అరవింద సమేత’లో ఏముంటుంది.?
‘అరవింద సమేత’ అంటూ టైటిల్‌ని పెట్టడంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ టైటిల్ విషయంలో ఎన్టీఆర్‌ని ఒప్పించగలిగాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి, ఎప్పుడో ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి వుందనీ, కొన్ని కారణాలతో ఆలస్యమయ్యిందని త్రివిక్రమ్ చెబుతూ వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ది కూడా ఇదే మాట. ఏదో ఒక సినిమా చేసేయడం కాదు, ఓ మంచి సినిమా చేయాలన్న ఆలోచనతోనే ‘కాంబినేషన్’ ఫైనల్ చేయడానికి టైమ్ తీసుకున్నట్లు యంగ్ టైగర్ చెప్పిన మాటలు ఊరికినే పోలేదు. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ హైప్ ఆ స్థాయిలో క్రియేట్ అయ్యిందంటే టీజర్, ట్రైలర్ ఆ స్థాయిలో వున్నాయి మరి.
టీజర్, ట్రైలర్.. దుమ్ము రేపేశాయ్
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అంటే, పక్కా మాస్. యంగ్ టైగర్ మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, త్రివిక్రమ్ పవర్‌ఫుల్‌గా ఈ సినిమా తెరకెక్కించాడని టీజర్‌తోనే అర్థమయిపోయింది. ట్రైలర్ దగ్గరకొచ్చేసరికి, కొంత ఎమోషనల్ టచ్ కూడా చూపించాడు. అదీ త్రివిక్రమ్ మ్యాజిక్ అంటే. యంగ్ టైగర్ గతంలో చేసిన ‘దమ్ము’ సినిమా కొంత మేర గుర్తుకొచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. అయినాగానీ, ఇది త్రివిక్రమ్ సినిమా. అంచనాల్ని మించి వుంటుందనడం నిస్సందేహం. యంగ్ టైగర్ ఎనర్జీని త్రివిక్రమ్ ఫుల్లుగా వాడుకున్నాడంటూ సినిమా ఇప్పటికే చూసిన అతి కొద్ది మంది సినీ ప్రముఖులు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారట.
యంగ్ టైగర్ చేసిన సాహసం
ఇలాంటి సినిమాలు చేయాలంటే దమ్ముండాలి.. ఇలాంటి సినిమాలు చేయాలంటే కమిట్మెంట్ వుండాలి. అవన్నీ వున్నోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెగనరకడం పెద్ద పనేమీ కాదు, కానీ.. ఆ నరికే పని రాకుండా వుండాలంటే.. రక్తపాతానికి ఫుల్స్టాప్ పెట్టాలంటే.. అంటూ, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇచ్చిన హింట్ ఈ సినిమాలో యంగ్ టైగర్ పాత్ర ఏంటో చెప్పకనే చెప్పేసింది. ఆ సంగతి పక్కన పెడితే, ట్రైలర్లో యంగ్ టైగర్ హావభావాలు, ఎనర్జీని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ‘అనగనగా..’ పాటలో యంగ్ టైగర్ ఎనర్జీ సూపర్బ్ అంతే. త్రివిక్రమ్‌తో ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు.. సరైన కథ కోసం వెయిట్ చేశాడు. తమ కాంబినేషన్‌పై వుండే అంచనాలు యంగ్ టైగర్‌కి తెలుసు మరి.
ప్రీ రిలీజ్ టాక్ ఎలా వుందంటే..
సినీ బిజినెస్ సర్కిల్స్‌పై ‘అరవింద సమేత’పై భారీ అంచనాలే వున్నాయి. అంచనాలు ఏ స్థాయికి చేరినా, వాటిని అందుకోగల సత్తా వున్నోడు యంగ్ టైగర్. 100 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ దిశగా సూపర్ హిట్ కొట్టేస్తాడని ప్రీ రిలీజ్ టాక్ని బట్టి అర్థమవుతోంది. అన్ని చోట్లా బిజినెస్ బీభత్సంగా జరగడం ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో వున్న అంచనాల్ని చెప్పకనే చెబుతున్నాయి. ఓవర్సీస్లో త్రివిక్రమ్‌కి, ఎన్టీఆర్‌కీ వున్న క్రేజ్ ఈ సినిమాకి అదనపు బోనస్. ఓవరాల్‌గా ఈ సినిమాపై ఏ స్థాయిలో వుండాలో అ స్థాయిలో వున్నాయి. దానికి తగ్గట్టే ప్రీ రీలీజ్ టాక్ పీక్ లెవల్లో నడుస్తోంది. దటీజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.