Janasena Party 24 MLAs జనసేన పార్టీ త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మరియు సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 24 అసెంబ్లీ సీట్లకు, మూడు లోక్ సభ సీట్లకు పోటీ చేయనుంది.
తెలుగు దేశం పార్టీతో పొత్తులో వున్న జనసేన, టీడీపీ నుంచి ఈ సీట్లను పొందగలిగింది. భారతీయ జనతా పార్టీ కూడా త్వరలో ఈ కూటమితో జత కట్టనున్న సంగతి తెలిసిందే.
అయితే, జనసేన పార్టీ 60 సీట్లలో పోటీ చేయాలన్న చర్చ అంతటా జరిగింది. జనసేనాని కూడా, ‘మూడో వంతు సీట్లు’ అనే వాదన వినిపిస్తూ వచ్చారు.
పొత్తులన్నాక ఇచ్చిపుచ్చుకోవడం తప్పనిసరి. గ్రౌండ్ రియాల్టీకి లోబడి ఏ రాజకీయ పార్టీ అయినా, పోటీ చేసే సీట్ల విషయమై ఓ అవగాహనకు రావాల్సి వుంటుంది.
Janasena Party 24 MLAs.. జనసేనాని వ్యూహాత్మక నిర్ణయం..
బేషజాలు ప్రదర్శిచేందుకు అనువైన సందర్భం కాదిది.. అన్న కోణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

మరోపక్క, టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ బయటకు వచ్చింది. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ సంయుక్తంగా, ఉమ్మడి అభ్యర్థుల జాబితాని విడుదల చేశారు.
ఇది మొదటి లిస్ట్. బీజేపీ కూడా పొత్తులోకి వచ్చాక, మిగతా అభ్యర్థుల లిస్ట్ ప్రకటితమవుతుంది. అప్పటికి, ఏమైనా మార్పులు చేర్పులు వుంటాయా.? అన్నది ఇప్పుడే చెప్పలేం.
98 శాతం స్ట్రైక్ రేట్..
ఇదిలా వుంటే, ఎన్ని సీట్లలో పోటీ చేసినాగానీ, 98 శాతం స్ట్రైక్ రేట్ వుండాలన్నది జనసేన శ్రేణులకు జనసేనాని చేసిన సూచన.
టీడీపీ – జనసేన (Jana Sena Party) మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అనేది సజావుగా సాగితేనే, కూటమి ఆశించిన ఫలితం దక్కుతుంది.
Also Read: వెండితెరపై విష ప్రయోగం! నువ్వు తినేది ‘కక్కిన కూడు’!
ఎన్ని సీట్లు దక్కాయి.? అన్న విషయమై ఆందోళన చెందకుండా, జనసేన శ్రేణులు.. జనసేన పోటీ చేస్తున్న 24 అసెంబ్లీ అలాగే మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో 98 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించేలా కృషి చేయాల్సి వుంటుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలుపుకుని మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు, అదనంగా మరో ముగ్గురు ఎంపీలు.. అలా చట్ట సభల్లో అడుగు పెడితే.. ఆ కిక్కే వేరప్పా.!