Pine Apple Health Benefits.. గర్భ ధారణ సమయంలో స్ర్తీలకు ఫుడ్ విషయంలో కొన్ని నిబంధనలుంటాయ్. ముఖ్యంగా కొన్ని రకాల పండ్ల విషయంలో చాలా స్ర్టిట్‌గా ఆయా నిబంధనలు పాఠిస్తుంటారు.
అందులో ఒకటి బొప్పాయి పండు తినకూడదు. ఇంకోటి అనాస పండు (పైనాపిల్) జోలికి పోకూడదు అని. ఈ రెండు పండ్లను తినడం వల్ల గర్భ స్రావం అవుతుందన్న మూఢ నమ్మకం వుంది.
అయితే, ఈ విషయంలో శాస్ర్తీయమైన ఆధారాలేమీ ఇంతవరకూ లేవని వైద్యుల వాదన. కానీ, ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకాలకు అనుగుణంగా గర్భిణీ స్ర్తీలు ఆ నిబంధనలకు లోబడి ఆయా పండ్ల జోలికి పోకుండా వుంటారు.
Pine Apple Health Benefits.. అనాసపై అపోహలొద్దు.!
కానీ, అనాస పండు మాత్రం గర్భిణీ స్ర్తీలు ఖచ్చితంగా తినాల్సిన పండు అని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
ఈ పండులో అధిక శాతం విటమిన్ ‘సి’ వుంటుంది. తల్లితో పాటూ పుట్టబోయే బిడ్డకీ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ సి అత్యంత కీలక పాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు, మందుల రూపంలో తీసుకునే ఫోలేట్ అనే పోషకం అనాస పండులో అత్యధికంగా వుంటుందట. ఇది పుట్టబోయే బిడ్డ వెన్నెముక, మెదడు వృద్ది చెందడంలో చురుకుగా పని చేస్తుందట.
అనాస పండులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ శరరీంలోని పలు అవయవాల వాపును తగ్గించడంలో సహాయ పడుతుంది.
గర్భధారణ సమయంలో సహజ సిద్ధంగా వుండే లక్షణాల్లో ఒకటి మల బద్దకం.
Also Read: Migraine Headache: మైగ్రేన్ తలనొప్పి, తీస్కోవాల్సిన జాగ్రత్తలు
ఈ సమస్యను తగ్గించడంలోనూ అనాస పండులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కీలక పాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అనాస పండు తింటే పుట్టబోయే బిడ్డకి ఉబ్బస వస్తుంది అనే అపోహ కూడా వుంది. ఈ విషయంలోనూ శాస్ర్తీయంగా ఆధారాల్లేవ్.

ఒకవేళ గర్భిణికి ఉబ్బస వున్నట్లయితే దాని నుంచి ఉపశమనం లభిస్తుంది అనాస పండును తినడం వల్ల.. అని వైద్యులు నొక్కి చెబుతున్నారు.
కానీ, ఎవరి నమ్మకాలు వారివి. గర్భ స్రావానికి అనాస పండు కారణం అవుతుందనడంలో ఎంత మాత్రం నిజం లేదనీ, ఎటువంటి ఆందోళన లేకుండా గర్భిణులు ఈ పండును తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:
ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం, అలాగే కొందరు వైద్య నిపుణుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ నివేదిక ఇవ్వబడింది. నమ్మకాల్ని కించపరచడం మా వుద్దేశ్యం కాదు, ఎవరి నమ్మకాలు వారివి.
కొన్ని రకాల శరీర తత్వాలను బట్టి కూడా కొన్ని రకాల పండ్లు తినడం, తినక పోవడం ఆధార పడి వుంటుంది. గర్భిణీ స్ర్తీలు ఏం చేసినా ఫైనల్‌గా వైద్యుని సలహా తీసుకోవడం వుత్తమం.