Table of Contents
Arvind Kejriwal Liquor Scam.. జైలు నుంచే ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని నిర్వహిస్తారట ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.!
అలా ఎదిగాడు, ఇలా పతనమయ్యాడు.. అంటూ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ జీవితంపై దేశవ్యాప్తంగా జనం చర్చించుకుంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్.. దేశ రాజకీయాల్లో పెను సంచలనం. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టి, బీజేపీని నామరూపాల్లేకుండా చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారీయన.
Arvind Kejriwal Liquor Scam.. అలా పుట్టి.. ఇలా ఎదిగి..
ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించుకుంటూ వెళుతున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగలిగిందంటే, దటీజ్ అరవింద్ కేజ్రీవాల్. సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే.. ప్రజలు ఆ నిజాయితీకి పట్టం కడితే.. ఇదీ పరిస్థితి.
కానీ, ఏం లాభం.? అరవింద్ కేజ్రీవాల్ కూడా సగటు రాజకీయ నాయకుడేనని తేలిపోయిందా.? ఏకంగా లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన.. ఇదేమీ చిన్న విషయం కాదు.
లిక్కర్ స్కామ్.. తీగ లాగితే..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల పేర్లూ వినిపించాయి.
కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులే కాదు, ఇతర పార్టీల నాయకులూ అరెస్టయ్యారు ఈ కేసులో. అలా అరెస్టయినవారిలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత కూడా వున్నారు.
కవిత అంటే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.?
కేసు తీవ్రత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే, ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని తమ మీదకు ఉసిగొల్పిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
దర్యాప్తు సంస్థలు.. పెంపుడు జంతువులు.?
రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. దర్యాప్తు సంస్థలు, అధికారంలో వున్న పార్టీలలకు పెంపుడు జంతువుల్లా వ్యవహరిస్తున్నాయన్నది ఈనాటి ఆరోపణ కాదు.
దర్యాప్తు సంస్థలపై ఆరోపణల సంగతి పక్కన పెడితే, సామాన్యుడిగా అరవింద్ కేజ్రీవాల్‌ని అభిమానించిన, సగటు భారతీయుడు.. ఆయన లిక్కర్ స్కామ్‌లో అరెస్టవడంపై ముక్కన వేలేసుకుంటున్నాడు.
గత కొన్నేళ్ళుగా అరవింద్ కేజ్రీవాల్‌ని రాజకీయంగా బీజేపీ వేధింపులకు గురిచేస్తున్న మాట వాస్తవం. లిక్కర్ స్కామ్ కూడా ఆ వేధింపుల్లో భాగమే అయితే, అరవింద్ కేజ్రీవాల్ రేంజ్ రానున్న రోజుల్లో మరింత పెరుగుతుంది.
లేదూ, లిక్కర్ స్కామ్‌లో గనుక అరవింద్ కేజ్రీవాల్ పాత్ర నిజమైతే.. ఆయన పతనం రాజకీయంగా ఊహించలేం.! కేజ్రీవాల్ పతనం సంగతి పక్కన పెడితే, ‘మార్పు’పై ప్రజలకీ నమ్మకం పోతుంది.
రాజకీయాల్లో ఎదగడం ఎంత ముఖ్యమో.. పతనమైపోకుండా జాగ్రత్త పడటం కూడా అంతే ముఖ్యం.! కానీ, ఇప్పటి రాజకీయాలు వేరు.! ఇప్పటి రాజకీయ నాయకులూ వేరు.
వ్యవస్థల సంగతి సరే సరి.! బట్ట కాల్చి మొహమ్మీద పడేసే వ్యవహారాల్ని చాలానే చూస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఏది నిజం.?
అమ్ముడుపోయిన మీడియా, భ్రష్టు పట్టిపోయిన రాజకీయాల్లో.. అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్తు ఎలా వుండబోతోంది.?
తులసి వనంలో గంజాయి మొక్కా.? లేదంటే, గంజాయి వనంలో తులసి మొక్కా.? అరవింద్ కేజ్రీవాల్ సంగతేంటో ముందు ముందు తేలనుంది.