పగలు వద్దే వద్దు.!? పడక మీదే ఎందుకు ముద్దు.!?

Srijita Ghosh

Book Reading Good Habit.. పుస్తక పఠనం.. చాలా చాలా మంచి అలవాటు.! ఇప్పుడైతే, పుస్తకం చేత్తో పట్టుకోవడమంటేనే నామోషీ.!

ఒకవేళ పుస్తకం పట్టుకున్నా, అది కేవలం స్టైలుగా ఫొటోలకు పోజులివ్వడం కోసమే తప్ప, పుస్తకం చదవాలన్న ధ్యాస ఎంతమందికి వుంటోంది.?

అయినా, పుస్తకాలెందుకు.? చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు,అన్ని పుస్తకాలకు సంబంధించిన సమాచారం అందులోనే దొరికేస్తుంది కదా.? అనేవారూ లేకపోలేదు.

Book Reading Good Habit.. పుస్తక పఠనం.. ఆరోగ్యకరమైన జీవన విధానం..

నిజమే.. పుస్తకాన్ని చదవడమంటే, ఆరోగ్యకరమైన జీవన విధానంగానే భావించాల్సి వుంటుంది. మంచి పుస్తకం, మంచి స్నేహితుడి లాంటిదని పెద్దలు చెబుతుంటారు.

Mouni Roy
Mouni Roy

పుస్తక పఠనం, విలువైన సమాచారం తెలుసుకునేందుకే కాదు, మానసికోల్లాసానికి కూడా.! మొబైల్ ఫోన్లలోనో, కంప్యూటర్లలోనే తెలుసకునే సమాచారానికీ, పుస్తక పఠనానికీ చాలా తేడా వుందంటారు పుస్తక ప్రియులు.

చదివే విషయం, మెదడుదాకా చేరి.. బలంగా గుర్తుండిపోయేలా చేయడం పుస్తక పఠనంతోనే సాధ్యమవుతుందన్నది నిపుణుల అభిప్రాయం.

పగలా.? రాత్రా.? ఎప్పుడైతే మంచిది.?

కొంతమంది పుస్తక పఠనానికి రాత్రి వేళ సరైన సమయం అనుకుంటారు. కానీ, నిద్ర పాడు చేసుకుని పుస్తక పఠనం చేస్తే, దానివల్ల ప్రయోజనం శూన్యం.

Also Read: తెలుగు సామెతలు: అడుసు తొక్కనేల కాలు కడగనేల.!

మంచి పుస్తకమైనాసరే, దాన్ని చదివేందుకు రాత్రి సమయాన్ని వృధా చేస్తే, అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి, జర జాగ్రత్త.!

Neha Sharma

చాలామంది పుస్తక పఠనానికి రాత్రి సమయాన్నే ఎందుకు ఎంచుకుంటారన్నదానిపై భిన్న వాదనలున్నాయ్. ఏ వాదన ఎలా వున్నా, రాత్రి వేళ పుస్తక పఠనం అనేది చాలా చాలా తక్కువ సమయానికే పరిమితం చేయాలి.

మార్కెట్లో చెత్త పుస్తకాలు చాలానే దొరుకుతున్నాయ్.! నిజానికి, చెత్త పుస్తకాలకున్నంత గిరాకీ మంచి పుస్తకాలకు ఎప్పుడూ వుండదు.

ఏది మంచి.? ఏది చెడు.? అన్నదానిపై ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెట్టి, మంచి పుస్తకాన్ని కొనుక్కుని, చదవండి.!

చెడు పుస్తకాన్ని చదవడం వల్ల సమయం వృధా తప్ప, ఎలాంటి ప్రయోజనమూ వుండదు.

Mudra369

మంచి పుస్తకంలో కొన్ని పేజీల్ని చదవడం వల్ల, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఆ రకంగా, పుస్తక పఠనం కొంత వరకు రాత్రి వేళల్లోనూ మంచిదే.

ఉదయం వేళ, మధ్యాహ్నం, సాయంత్రం.. ఇలా పుస్తక పఠనం ఎప్పుడు చేసినా, అది మంచిదే.!

Vaishnavi Rao

నిజానికి, పుస్తక పఠనమంటే సమయం, సందర్భంతో పనేం లేదు. ఏమాత్రం సమయం కుదిరినా, కాస్సేపు పుస్తకాన్ని అలా తిరగేస్తే.. మంచిదే కదా.!

అర్థమయ్యింది కదా.. పుస్తక పఠనం గురించి కాస్తయినా.! మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి.

hellomudra

Related post