Neha Sharma Politics.. ఏం.? రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు.? ఎవరైనా, రాజకీయాల్లోకి రావొచ్చు. రాజకీయాలపై ఆసక్తి వుంటే చాలు.!
కానీ, ఎన్నికల్లో పోటీ చేయాలంటే, బోల్డన్ని డబ్బులుండాలి. రాజకీయాలు చాలా ఖరీదైపోయాయ్ మరి.! అదే, రాజకీయ నేపథ్యం వున్న కుటుంబమైతే.. పెద్దగా ఇబ్బందేమీ వుండదు.
ఎవరీ చిరుత పిల్ల.? ఇంకెవరు, నేహా శర్మ (Neha Sharma). అదేనండీ, రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’లో హీరోయిన్0గా నటించింది కదా.! ఆ బ్యూటీనే.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. ఆ తర్వాత ‘కుర్రాడు’ పేరుతో తెరకెక్కిన మరో తెలుగు సినిమాలోనూ ఈ బ్యూటీ కనిపించింది. వరుణ్ సందేశ్ ఆ సినిమాలో హీరో.
Neha Sharma Politics.. రాజకీయ నేపథ్యం వుందిలే..
నేహా శర్మ తండ్రి అజయ్ శర్మ రాజకీయాల్లోనే వున్నారు. ఆయన కాంగ్రెస్ నేత. తన కుమార్తెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారాయన.

గతంలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున తన తండ్రి కోసం నేహా శర్మ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంది. ఈసారి ఆమే స్వయంగా రాజకీయాల్లోకి రాబోతోందిట.
అన్నట్టు, నేహా శర్మకి ఓ చెల్లెలు కూడా వుందండోయ్. ఆమె పేరు ఐషా శర్మ. ఆమె కూడా తండ్రి తరఫున రాజకీయ ప్రచారం చేసింది గతంలో.
ఎంపీగా పోటీ చేస్తుందా.?
బీహార్లోని భగల్పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేహా శర్మ పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై నేహా శర్మ తండ్రి అజయ్ శర్మ చూచాయిగా ఓ ప్రకటన కూడా చేసేశారు. భగల్ పూర్ నుంచి నేనుగానీ, నా కుమార్తెగానీ పోటీ చేస్తాం.. అని చెప్పారాయన.

అయితే, అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధినాయకత్వానిదేనని అజయ్ శర్మ ప్రకటించడం గమనార్హం.
రాజకీయాల్లో సినీ గ్లామర్ కొత్తేమీ కాదు. కాకపోతే, వయసు మీద పడ్డాక అందాల భామలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుంటారు.
Also Read: బరువులెత్తడం బ్రహ్మవిద్యేం కాదు భామామణులకి.!
నేహా శర్మ మాత్రం.. రాజకీయాలపై కాస్తంత తొందర పడుతున్నట్లే కనిపిస్తోంది. తొందర ఆమెకా.? ఆమె తండ్రి అజయ్ శర్మకా.? ఏమో మరి, ఈ విషయమై నేహా శర్మ పెదవి విప్పాల్సి వుంది.