Cunning Star Allu Arjun.. అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ కాస్తా, ఐకాన్ స్టార్ అయ్యాడు.! స్టైలిష్ స్టార్ అన్న బిరుదునిచ్చింది మెగాస్టార్ చిరంజీవి.
ఎదిగాడు కదా, ఈసారి ఐకాన్ స్టార్ అని తనకు తానే బిరుదు ఇచ్చేసుకున్నాడు. అంతేనా.? చిరంజీవి ఇచ్చిన బిరుదు నచ్చక, ఐకాన్ స్టార్ అని మార్చేసుకున్నాడా.?
సరే, ఏదైతేనేం, ‘చెప్పను బ్రదర్’ అంటూ, మెగా కాంపౌండ్‌కి దూరం జరగడం మొదలు పెట్టిన అల్లు అర్జున్, ఆ గ్యాప్ అలా మెయిన్‌టెయిన్ చేస్తూనే వున్నాడు.
Cunning Star Allu Arjun.. కుటుంబ సభ్యుడంటూనే వెన్నుపోటు..
మొన్నీమధ్యనే, ‘కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు మీకే వుంటాయ్ పవన్ కళ్యాణ్ గారూ..’ అంటూ ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా అల్లు అర్జున్ ట్వీటేశాడు.
నోటితో నవ్వి, నొసటితో వెక్కించిన చందాన, ట్విట్టర్‌లో జనసేనానికి మద్దతు పలికిన అల్లు అర్జున్, ఆ జనసేనాని ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో, ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా, గ్రౌండ్ లెవల్‌కి దిగజారిపోయాడు అల్లు అర్జున్.

వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా, నంద్యాలకి అల్లు అర్జున్ (Allu Arjun) వెళ్ళడం చర్చనీయాంశమయ్యింది.
వెళ్ళడమూ తప్పు కాకపోవచ్చు. వెళ్ళాక, ‘పిలవకపోయినా, నేను వచ్చాను.. నా స్నేహితుడి కోసం..’ అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
అభిమాన సంఘాల ముసుగులో ఓ పెయిడ్ పీఆర్ మాఫియా అల్లు అర్జున్ కోసం పనిచేస్తోందన్న విమర్శ ఈనాటిది కాదు.
అది ప్రతిసారీ, అల్లు అర్జున్‌కి అనుకూలంగా కంటే, మెగా కాంపౌండ్‌కి వ్యతిరేకంగా అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తుండడం ముమ్మాటికీ ఆక్షేపణీయమే.
Mudra369
కుటుంబ సభ్యుడే కదా, అలాంటప్పుడు.. పవన్ కళ్యాణ్ కోసం కదా, పిఠాపురం వెళ్ళాల్సింది.? కుటుంబ సభ్యుడి కోసం ట్వీటేసి, స్నేహితుడు వద్దంటున్నా నంద్యాలకు వెళ్ళి వైసీపీకి మద్దతివ్వడం దేనికి సంకేతం.?
పనికిమాలిన స్టేట్మెంటు..
పైగా, పోలింగ్ రోజున.. ‘నా అనుకున్నవాళ్ళు ఏ పార్టీలో వున్నా మద్దతిస్తాను..’ అంటూ పనికిమాలిన స్టేట్మెంటొకటి పాస్ చేశాడు అల్లు అర్జున్.
నిజానికి, అల్లు అర్జున్ కారణంగా జనసేన పార్టీకి అదనంగా ఒరిగేదేమీ లేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అభినందించాలి. ఎందుకంటే, అస్సలు అల్లు అర్జున్‌ని పట్టించుకోలేదు.
Also Read: జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిస్తే, జనం గెలిచినట్టే.!
కన్నింగ్ అన్న పదానికి పెర్‌ఫెక్ట్ నిదర్శనంగా అల్లు అర్జున్ ఇంకోసారి తనను తాను నిరూపించుకున్నాడంతే. ఇది పవన్ కళ్యాణ్ అభిమానుల అభిప్రాయమే కాదు, అతని తీరు చూసిన చాలామంది చెబుతున్నమాట.
తన స్నేహితుడికి మద్దతివ్వడం తప్పు కాదు. కానీ, కుటుంబ సభ్యుడికి సంబంధించి అత్యంత కీలకమైన సందర్భంలో, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు.. ముమ్మాటికీ ఆక్షేపణీయమే.