Kajal Aggarwal Satyabhama Movie.. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తెలుగు తెరపై కొత్తేం కాదు. చాలా మంది చేశారు. చేస్తూనే వున్నారు. ఇకపైనా చేస్తుంటారు. అలా కాజల్ చేస్తున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘సత్యభామ’.
ఈ సినిమా ప్రోమోస్ ప్రతీ ఒక్కటీ ఒకదానికి మించి ఇంకోటి అన్నట్లుగా అంచనాల్ని పెంచేస్తున్నాయ్. సత్యభామ పాత్రలో చాలా కొత్తగా కనిపించబోతోంది కాజల్ అగర్వాల్.
పాటలు కూడా చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసినట్లుగా కనిపిస్తోంది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ ఎంచుకునే పాత్రలు ఆసక్తికరంగా వుంటున్నాయ్.
క్వీన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాజల్.!
మొన్నీ మధ్యనే ‘భగవంత్ కేసరి’లో కాత్యాయని పాత్రలో అందంగా కనిపిస్తూనే డిఫరెంట్‌గా ఆకట్టుకుంది కాజల్ అగర్వాల్.
అలాగే విశ్వనటు కమల్ హాసన్‌తో కాజల్ నటించిన ‘ఇండియన్ 2’ రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ‘సత్యభామ’. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. ఆ పాత్రలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది కాజల్ అగర్వాల్.
అంతే కాన్ఫిడెన్స్‌తో యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ నటించేసింది ఈ సినిమా కోసం అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).
లుక్స్ పరంగానే కాదు, ఆటిట్యూడ్ పరంగానూ కాజల్ (Kajal Aggarwal) సత్యభామగా చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది ఈ సినిమాలో.
కాజల్ చేసిన ఈ డిఫరెంట్ అటెంప్ట్ ప్రోమోల వరకూ అయితే భారీగా అంచనాలు పెంచేసిందనుకోండి. అయితే, రిలీజ్ తర్వాత ఏం చేస్తుందో చూడాలి మరి.