Home » మాస్ కా దాస్ ‘లైలా’.! విశ్వక్ సేన్ నువ్వు ‘తోపు’ అంతే.!

మాస్ కా దాస్ ‘లైలా’.! విశ్వక్ సేన్ నువ్వు ‘తోపు’ అంతే.!

by hellomudra
0 comments
Vishwak Sen Laila

Vishwak Sen Laila.. వెండితెరపై లేడీ గెటప్స్‌లో హీరోలు నటించడం కొత్తేమీ కాదు. రాజేంద్ర ప్రసాద్ ‘మేడమ్’ సినిమా ఓ క్లాసిక్.!

ఈ తరం హీరోల్లో తమిళనటుడు కార్తికేయన్, ‘రెమో’ సినిమాలో లేడీ గెటప్‌తో అలరించిన సంగతి తెలిసిందే.! ఇంకా చాలామంది నటులున్నారు.. తమదైన స్టయిల్లో లేడీ గెటప్స్‌లో మెప్పించారు.

తాజాగా, విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్ ‘లైలా’ నుంచి అప్‌డేట్ వచ్చింది.

Vishwak Sen Laila.. విశ్వక్ సేన్ బ్యూటిఫుల్ లుక్.!

2025 ఫిబ్రవరి 14న ఈ ‘లైలా’ సినిమా విడుదల కాబోతోందిట. చూస్తున్నారు కదా.. విశ్వక్ సేన్ బ్యూటిఫుల్ లుక్.! ఇది ‘లైలా’ సినిమాకి సంబంధించినదే.

నో డౌట్.. విశ్వక్ సేన్ విలక్షణ నటుడు. ఆటిట్యూడ్ విషయంలో కొన్ని కంప్లయింట్స్ విశ్వక్ సేన్‌కి వ్యతిరేకంగా వున్నాగానీ, విలక్షణమైన సబ్జెక్టుల్ని ఎంచుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు.

Vishwak Sen Laila
Vishwak Sen

మొన్నామధ్య ‘గామి’ సినిమాలో విశ్వక్ సేన్ నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కొన్ని సినిమాలు నిరాశపర్చినాగానీ, ప్రయోగాల విషయంలో అస్సలు వెనుకడుగు వేయడంలేదు విశ్వక్ సేన్.

Also Read: కల్కి 2898 ఎడి రివ్యూ: ప్రభాస్ వర్సెస్ అమితాబ్.!

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ‘లైలా’ సినిమా నుంచి విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) పోస్టర్ మైండ్ బ్లోయింగ్ అంతే.

రామ్ నారాయణ దర్శకత్వంలో సాహు గారపాటి ‘షైన్ స్క్రీన్స్’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆకాంక్ష శర్మ ఈ ‘లైలా’ (Laila Movie) సినిమాలో హీరోయిన్.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group