Political Power Star Pawan Kalyan.. ‘నన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనొద్దు..’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన అభిమానులకు సూచించారు.
అభిమానుల్ని పార్టీ కార్యకర్తలుగా మార్చే క్రమంలో, వారికి రాజకీయాలపై సరైన అవగాహన కలిగే విధంగా, ముందు తన ‘సినిమా’ ఇమేజ్‌ని వదిలించుకున్నారు పవన్ కళ్యాణ్.
పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ‘కూటమి’కి సరికొత్త డెఫినిషన్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్. ఇదొక కేస్ స్టడీ.! భవిష్యత్తులో ఏర్పడే కూటములకు జనసేన – టీడీపీ – బీజేపీ కూటమి గెలుపు.. నిజంగానే ఓ కేస్ స్టడీ.!
Mudra369
2014లో జనసేన పార్టీ ఏర్పాటైతే, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారిగా పోటీ చేసింది. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుని జనసేన గెల్చుకున్నా, జనసేన అధినేత మాత్రం రెండు చోట్ల ఓడిపోయారు.
Political Power Star Pawan Kalyan.. నీఛమైన విమర్శల్ని ఎదుర్కొని..
అప్పటినుంచి, రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్‌ని నానా రకాలుగా తూలనాడుతూ వచ్చారు. అత్యంత అధమ స్థాయికి, అత్యంత నీఛమైన స్థాయికి దిగజారి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు.

టైమ్ చూసి, అందరికీ సరైన సమాధానం చెప్పాలనుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను ఫక్తు రాజకీయం చేస్తే ఎలా వుంటుందో, తనదైన వ్యూహాలు రచిస్తే ఎలా వుంటుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసి చూపించారు.
ఫలితం, రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 151 సీట్లతో 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీని, ‘క్రికెట్ టీమ్’ తరహాలో, 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేయగలిగారు జనసేనాని.
పొలిటికల్ పవర్ స్టార్..
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఏర్పడటానికి కారణమే పవన్ కళ్యాణ్. 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్.. అంటూ, నేషనల్ మీడియా కొనియాడుతోంది.
Also Read: మేతావి ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరం.!
అంతే కాదు, ‘పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అని కూడా నేషనల్ మీడియానే కొనియాడుతుండడం గమనార్హం.
గెలుపుని ఓ బాధ్యతగా భావించే నాయకుడు.. ప్రజలు తనకిచ్చిన బాధ్యతను ఇంకా బాధ్యతగా మోస్తాడు. ప్రజలకు మేలు చేస్తాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడు.
Mudra369
‘ఇకపై దేశంలో పొత్తుల గురించిన ప్రస్తావన రాజకీయ పార్టీల మధ్య వస్తే, జనసేనాని వ్యూహాల్ని కేస్ స్టడీగా తీసుకోవాల్సి వుంటుంది..’ అని నేషనల్ మీడియా పేర్కొంది.
ఇది ఆషామాషీ గౌరవం కాదు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలో, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది జనసేన. పోటీ చేసిన అన్ని సీట్లలోనూ జనసేన పార్టీ బంపర్ విక్టరీ సాధించి ‘భళా’ అనిపించింది.