Table of Contents
Duvvada Srinivas Ranku Rajakeeyam.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద ‘అడల్ట్రీ’ ఆరోపణలు వస్తున్నాయ్.!
ఆరోపణలేంటి, అది నిజమేనని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు.! పైగా, ముప్ఫయ్యేళ్ళుగా ‘బయటి తిరుగుళ్ళు’ ఆయనకి అలవాటేనట.
‘నేనేమీ సచ్చీలుడ్ని కాదు.. శ్రీరామచంద్రమూర్తిని అసలే కాదు. నాకు బయటి తిరుగుళ్ళు అలవాటే.. పెళ్ళయ్యాక, ఈ ముప్ఫయ్యేళ్ళలో ఎన్నో తిరుగుళ్ళు తిరిగాను’ అని ఓ ఇంటర్వూలో చెప్పుకున్నారాయన.
Duvvada Srinivas Ranku Rajakeeyam.. చెరువు గట్టు మీద నిప్పు..లాంటి చరిత్ర.!
నిఖార్సయిన నిప్పు కణికలా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన ‘చరిత్ర’ గురించి చెప్పుకుంటోంటే, నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు సామాన్యులకి.
దువ్వాడ శ్రీనివాస్ మీద అతని భార్య వాణి, అలాగే ఈ ‘పుణ్య’ దంపతుల సంతానం (ఇద్దరు కుమార్తెలు) తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మరోపక్క, ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర బిందువుగా మారిన మూడో మనిషి ‘మాధురి’ కూడా, ‘అడల్ట్రీ’ కామెంట్లు చేయడం గమనార్హం.
చిత్రమేంటంటే, ఈ మొత్తం కథలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విడివిడిగా చాలా క్రియాశీలంగా వున్నారు.
ఘనకార్యం కాదిది.. చీకటి వ్యవహారం.!
మామూలుగా అయితే, ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూసినప్పుడు, ‘నేనేమీ తప్పు చేయలేదు’ అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకోవాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ అనాలి.
కానీ, దువ్వాడ శ్రీనివాస్ అలాంటి మాటలేమీ చెప్పట్లేదు. అన్నీ ఒప్పేసుకుంటున్నాడాయన. అయినాగానీ, వైసీపీ అధినాయకత్వం ఆయన మీద ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు.
‘రాజకీయం.. రంకు.. రెండూ ఒకటే..’ అని ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేయడం మామూలే. ఇదిప్పుడు నిప్పులాంటి నిజమని.. ఇదిగో, ఇలాంటి నాయకులు నిరూపించేస్తున్నారు.
ఓటరుకి జ్ఞానోదయం ఎప్పుడవుతుందో.!
మనం ఎవరికి ఓటేస్తున్నాం.? అన్న ఇంగితం ఓటరుకి లేనంత కాలం.. ఇదిగో, ఇదే పరిస్థితి.! జీవిత భాగస్వామితో పొసగకపోవడం నేరం కాదు.!
Also Read: వైకల్యానికి కోటా ఎందుకని ప్రశ్నించినందుకే ఆమెని రక్కేస్తారా?
విడాకులనే ప్రక్రియ ఒకటి వుంటుంది. సర్దుబాటు కుదరనప్పుడు, చట్టబద్ధంగా విడిపోయి, అంతే చట్టబద్ధంగా ఇంకొకర్ని జీవిత భాగస్వామిగా చేసుకోవచ్చు.
అంతేగానీ, ఈ అక్రమ సంబంధాలేంటి.? పైపెచ్చు, మీడియాకెక్కి ఈ రచ్చ ఏంటి.? నలుగురూ నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?