Home » నేను కాదు, నా భారత దేశం.! ఎన్టీయార్ దేశభక్తి.!

నేను కాదు, నా భారత దేశం.! ఎన్టీయార్ దేశభక్తి.!

by hellomudra
0 comments
Jr NTR RRR Movie

NTR Goes Global RRR ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ పురస్కారాల బరిలో నిలిచింది. ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ రావడం ఖాయమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ప్రపంచ సినిమా వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ అందుకుంటున్న ‘గౌరవం’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఆ ‘ఆర్ఆర్ఆర్’, ప్రపంచ సినిమా వేదికపై, ఇండియన్ సినిమా.. అందునా, తెలుగు సినిమాకి మరింత కీర్తి ప్రతిష్టల్ని అందించబోతోంది.

ఆస్కార్.. ఓ అద్భుతమైన గౌరవం..

ఆ అద్భుత క్షణాల కోసం ఎదురుచూస్తున్నా..

ఆస్కార్ వేదికపై డాన్స్ చేయబోవడంలేదు..

అక్కడ.. అందరి ముందర ‘నాటు నాటు’పై ప్రశంసల్ని ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నా..

నేను కాదు, నా పాత్ర కాదు.. నా దేశానికి దక్కుతున్న గౌరవంగా భావిస్తున్నా..

Jr NTR

ఈ అత్యద్భుత క్షణాల్ని యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు.? ‘ఆస్కార్’ పురస్కారాల వేడుకలో, ‘నాటు నాటు’ పాటకి చరణ్, ఎన్టీయార్ కలిసి డాన్స్ చేస్తారా.? లేదా.?

NTR Goes Global RRR.. మేం డాన్స్ చేయడంలేదు..

ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘మేం డాన్స్ చేయడంలేదు.. కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ప్రదర్శన ఇస్తోంటే, చూడటాన్ని ఎంజాయ్ చేస్తాను..’ అని చెప్పాడు జూనియర్ ఎన్టీయార్.

Jr NTR RRR Movie Ram Charan
Jr NTR RRR Movie Ram Charan

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడవడం గురించి మాట్లాడుతూ, ‘నేను కాదు, భారతదేశం అలా హుందాగా నడుస్తున్నట్లు భావిస్తాను..’ అని చెప్పాడు ఎన్టీయార్.

ఎన్టీయార్ దేశభక్తికి ఎవరైనా హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఎన్టీయార్, రామ్ చరణ్ సహా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్, ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద సందడి చేయనున్న సంగతి తెలిసిందే.

Also Read: ‘మహా’ కెలుకుడు.! కేజీఎఫ్’పై వెంకటేష్ ‘మసాలా’ మంట.!

నిజానికి, ఆస్కార్ పురస్కారం భారతీయ సినీ పరిశ్రమకు దక్కడం గతంలోనూ జరిగింది. కాకపోతే, ఈసారి మరింత ప్రత్యేకం.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇండియన్ సినిమా గురించి ప్రపంచ వేదికలపై చర్చ జరుగుతోంది. ప్రపంచ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ని కొనియాడుతూ, ఇండియన్ సినిమాని ప్రత్యేకంగా గౌరవిస్తోంది.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group