Table of Contents
చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్‌కి (Doctor Rajasekhar) ‘పిఎస్‌వి గరుడ వేగ’ (PSV Garuda Vega) కావాల్సినంత ఆక్సిజన్ ఇచ్చింది. ఆ ఊపులో పలు చిత్రాలకు ఆయన సంసిద్ధమయ్యారు. రాజశేఖర్ హీరోగా ‘అ’ ఫేం ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో ‘కల్కి’ (Kalki) సినిమా తెరకెక్కనున్న సంగతి తెల్సిందే.
ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు అందాల భామలు నటించబోతున్నారు. ‘కల్కి’ ఇదొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ (C Kalyan), రాజశేఖర్ కుమార్తెలు శివానీ (Shivani Rajasekhar), శివాత్మిక (Shivatmika Rajasekhar) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనుండడం గమనార్హం.
ముగ్గురు భామల ‘కల్కి’ (Kalki)
రాజశేఖర్ సరసన ఈ సినిమాలో ముగ్గురు అందాల భామలు నటించబోతున్నారు. అయితే, ముగ్గురూ హీరోయిన్లే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇదొక థ్రిల్లర్ మూవీ (Thriller Movie). పైగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ (Investigative Thriller). దాంతో, ముగ్గురు అందాల భామలూ ముఖ్యమైన పాత్రల్లోనే కన్పించే అవకాశముంది. అయితే, వీరిలో ఎవరు రాజశేఖర్ సరసన ‘హీరోయిన్’ రోల్‌లో కన్పిస్తారనేది ఇప్పటికైతే సస్పెన్సే.
ఆ ముగ్గురు అందాల భామల్లో ఒకరు ‘హార్ట్ ఎటాక్’ (Heart Attack) (నితిన్ Nithin హీరోగా, పూరి జగన్నాథ్ Puri Jagannadh దర్శకత్వంలో వచ్చిన సినిమా) ఫేం ఆదా శర్మ Adah Sharma కాగా, మరొకరు యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ (Ekkadiki Pothavu Chinnavada) సినిమాలో దెయ్యం పాత్రలో కన్పించిన నందితా శ్వేత (Nanditha Swetha). మూడో భామ ఐటమ్ బాంబ్‌గా తెలుగు నాట పలు సినిమాల్లో కన్పించింది. ఆమె పేరు స్కేర్లెట్ (Scarlett wilson). ముగ్గురికీ సినిమాలో మంచి ప్రాధాన్యత వుంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
‘గరుడ వేగ’ టర్నింగ్ పాయింట్
లిమిటెడ్ బడ్జెట్ అనలేం ‘గరుడ వేగ’ (Garuda Vega) గురించి. ఎందుకంటే ఆ సినిమా అంత రిచ్‌గా రూపొందింది. పైగా ఈ సినిమాలో హాట్ బ్యూటీ సన్నీలియోన్ (Sunny Leone) ఓ స్పెషల్ సాంగ్‌లో (Special Song) నటించిందాయె. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. చేస్తే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ మాత్రమే చేయాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకే, ఆయన్నుంచి ‘గరుడ వేగ’ తర్వాత మరో సినిమా రావడానికి కాస్త సమయం పట్టింది.
నేపథ్యం 1983
‘కల్కి’ (Kalki) సినిమా ఇప్పటి కథ కాదు. 1983 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న సినిమా. ఇటీవలి కాలంలో, ఈ తరహా సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం విదితమే. 1983 నాటి కథ సరే.. పాయింట్ ఏంటట.? అది మాత్రం ఇప్పటికైతే సస్పెన్సే. కథ విన్నప్పుడే రాజశేఖర్ ఎంతో థ్రిల్ ఫీలయ్యాడట. అంతలా ఈ కథని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
బడ్జెట్ పరంగా చూసుకున్నా రాజశేఖర్ సినిమాల్లో ఇదొక స్పెషల్ మూవీ కాబోతోందని సమాచారమ్. థ్రిల్లర్ సినిమాలకే ‘బాప్’ అనేలా ఈ సినిమా వుండబోతోందట. ‘అ’ సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ, ఈ సినిమాతో సూపర్బ్ కమర్షియల్ సక్సెస్‌ని కూడా అందుకుంటాడేమో చూడాలిక.