Jr NTR Vetrimaaran.. వెట్రిమారన్ సినిమాలంటే తమిళంలోనే కాదు, ఆ సినిమాలు తెలుగులో డబ్ అయితే, తెలుగునాట కూడా బోల్డంత క్రేజ్ వుంటుంది.
ఔను, వెట్రిమారన్ సినిమాలు సహజంగా వుంటాయ్.! అందుకే, వెట్రిమారన్‌తో సినిమాలు చేయడానికి హీరోలు పోటీ పడుతుంటారు.
అయితే, కథకి తగ్గ హీరోల్ని అన్వేషిస్తుంటాడు వెట్రిమారన్. అంతే తప్ప, హీరోల కోసం కథలు తయారు చేసుకోడు.. అదే, వెట్రిమారన్ ప్రత్యేకత.
Jr NTR Vetrimaaran.. జూనియర్ ఎన్టీయార్‌తో వెట్రిమారన్ సినిమా.?
చెన్నయ్‌లో ‘దేవర’ ప్రమోషన్ కోసం సందర్భంగా జూనియర్ ఎన్టీయార్, ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. ఫేవరెట్ డైరెక్టర్ ఎవరన్న ప్రశ్నకు వెట్రిమారన్ పేరు చెప్పాడు.
వెట్రిమారన్‌తో తమిళంలో సినిమా చేయాలని వుందనీ, దాన్ని తెలుగులోకి డబ్ చేసుకుంటామని జూనియర్ ఎన్టీయార్ వ్యాఖ్యానించాడు.
స్ట్రెయిట్ తమిళ సినిమా చేయాలని, అదీ వెట్రిమారన్‌తో సినిమా చేయాలని జూనియర్ ఎన్టీయార్‌కి అనిపించడం విశేషమే.!
సహజత్వం కోసమే కావొచ్చు..
తెలుగులో వెట్రిమారన్ సినిమా చేస్తే, సహజత్వం దెబ్బ తింటుందనీ, ఇక్కడి కమర్షియల్ హంగులు, వెట్రిమారన్‌కి నచ్చకపోవచ్చనేది జూనియర్ ఎన్టీయార్ అభిప్రాయమా.?
ఏమో, అంతేనేమో.! అలాగే అనుకోవాలేమో.! కానీ, తెలుగునాట పాన్ ఇండియా సినిమాలొస్తున్నాయ్.. అవి చూసి, తమిళ సినీ పరిశ్రమ కూడా ముక్కున వేలేసుకుంటోంది.
కాగా, చాలాకాలం నుంచి వెట్రిమారన్ తెలుగు సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎన్టీయార్ కోరికని వెట్రిమారన్ తీరుస్తాడా.? వేచి చూడాల్సిందే.