Jani Master Tollywood Choreography.. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో ఓ ప్రముఖ హీరో పేరు తెరపైకొస్తోంది.!
బాధితురాలిగా చెప్పబడుతున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌కి ఆ ప్రముఖ హీరో అండగా వున్నాడన్న ప్రచారంతోనే, ఈ మొత్తం వ్యవహారం వెనుక దాగి వున్న కుట్ర ఏంటన్న చర్చ అంతటా జరుగుతోంది.
కొన్నాళ్ళుగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ, అతన్ని ఆకాశానికెత్తేసిన ‘ఆమె’, ఇప్పుడిలా ఆయనకు అడ్డం తిరగడం ఒకింత ఆశ్చర్యకరం.
ఆ హీరోకి ఎందుకంత ఒళ్ళు మంట.?
జానీ మాస్టర్, జనసేన నేత కావడం, ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఇదంతా గిట్టని ఆ ప్రముఖ హీరో, ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌కి తన సినిమాల్లో అవకాశమిచ్చి, జానీ మాస్టర్‌కి ఎదురు తిరిగేలా చేశాడన్నది ఓ వాదన.
అంతే కాకుండా, మెగా కుటుంబంపై విపరీతమైన ద్వేషం పెంచేసుకున్న ఆ హీరో, ఆ మెగా కాంపౌండ్ అంటే అమితమైన అభిమానం ప్రదర్శించే జానీ మాస్టర్ని దెబ్బ తీయాలని కుట్ర పన్నాడన్నది మరో వాదన.
జానీ మాస్టర్‌కి ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ పురస్కారం దక్కితే.. అప్పుడు కూడా సదరు హీరో, జానీ మాస్టర్ని అభినందించలేకపోయాడు.! పైగా, అతనితో గతంలో సినిమాలు కూడా చేశాడా హీరో.!
Mudra369
చిత్రమేంటంటే, మెగా కాంపౌండ్‌కి వ్యతిరేకంగా రాజకీయ కుట్ర నడుపుతోన్న ఓ రాజకీయ పార్టీతో సదరు హీరో చేతులు కలిపిన వైనం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఆ రాజకీయ పార్టీకి చెందిన మద్దతుదారులు, సదరు హీరో అభిమానులు.. ఓ ముఠాగా ఏర్పడి, సోషల్ మీడియాలో, మెగా కాంపౌండ్ మీదా అలాగే జనసేన పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు గత కొంతకాలంగా.
జానీ మాస్టర్ తప్పు చేసి వుంటే, శిక్ష పడి తీరాల్సిందే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.! కానీ, కొందరు పన్నిన కుట్రకు ఆయన బలిపశువు అవ్వడమంటే అంతకన్నా దారుణం ఇంకోటి వుండదు.