Samantha Konda Surekha Controversy.. అదేంటీ.! ఎవరికీ ‘కారణం’ చెప్పకుండా విడాకులు తీసుకోవడమేంటి.? కొండా సురేఖకి అయినా చెప్పాలి కదా.? చెప్పకపోతే ఎలా.?
అక్కినేని నాగచైతన్య – సమంత చాన్నాళ్ళ క్రితమే విడాకులు తీసుకున్నారు. సాధారణంగా భార్యాభర్తల మధ్యపొరపచ్చాలు వస్తే, తేలికగానే సమసిపోతాయ్.
కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద వివాదాలుగా మారతాయి. సమస్యకి పరిష్కారం దొరక్కపోతే, విడాకులను ఆశ్రయిస్తారు. ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం.
సరే, వివాహం అనేది కుటుంబాల కలయిక.. లాంటి మాటల సంగతి వేరే.! ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించలేని పరిస్థితులున్నప్పుడు, కలహాల కాపురాన్ని నడపడం కంటే, విడాకులు తీసుకోవడం మేలు.
Samantha Konda Surekha Controversy.. ఏం పొరపచ్చాలు వచ్చాయో..
ఏం పొరపచ్చాలు నాగచైతన్య, సమంత మధ్య వచ్చాయి.? అన్నది ఆ ఇద్దరి వ్యక్తిగత వ్యవహారం. కలిసి బతకలేక, విడిపోయారు.
‘మ్యూచువల్ అండర్‌స్టాండింగ్’తో విడిపోయామని ఇద్దరూ ప్రకటన విడుదల చేశారు. సెలబ్రిటీలుగా వారిద్దరూ అంతకు మించి ఏం చేయగలరు.?

అయితే, విడాకుల తర్వాత అటు నాగచైతన్య మీద, ఇటు సమంత మీద.. ఇరువురు అభిమానులూ దూషణలకు దిగారు. పెద్ద రచ్చే జరిగింది, జరుగుతూనే వుంది కూడా.!
అంతకు మించి.. ఇప్పుడు తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. విడాకులకు కారణం.. తెలంగాణ మాజీ మంత్రి కేటీయార్.. అని కొండా సురేఖ బాంబు పేల్చారు.
అలా ఎలా వాగుతారు మేడమ్.?
కొండా సురేఖ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై మొత్తంగా సినీ పరిశ్రమ స్పందించింది.. కొండా సురేఖకి చీవాట్లు పెట్టింది.
మరోపక్క, కొండా సురేఖపై న్యాయపోరాటం ప్రారంభించారు సినీ నటుడు అక్కినేని నాగార్జున. వంద కోట్లకి పరువు నష్టం దావా కూడా వేస్తున్నారు.
Also Read: కట్టుకున్న భార్యని రోడ్డు మీదకు లాగేసిన ‘పాండిత్యం’.!
ఇంత జరిగాక, కొండా సురేఖ క్షమాపణ కూడా చెప్పారు. అంతలోనే, సమంత – నాగచైతన్య విడాకులకు కారణమేంటి.? పరిశ్రమలో నానా రకాలుగా అంటున్నారు. ఆ మాటలే నేనూ చెప్పా.. అంటున్నారామె.!
ఇదా పద్ధతి.? కొండా సురేఖకి చెప్పి సమంత విడాకులు తీసుకోవాలా.? రాజకీయం అంటే ఏదైనా మాట్లాడొచ్చా.?