‘గీతాంజలి’గా రష్మిక మండన్న.! లుక్ అదిరింది.!

Rashmika Mandanna Geethanjali Animal

Rashmika Mandanna Animal Geethanjali.. నేషనల్ క్రష్ రష్మిక మండన్న, ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరో. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి రష్మిక లుక్‌ని తాజాగా రివీల్ చేశారు.

‘గీతాంజలి’ పాత్రలో రష్మిక మండన్న (Rashmika Mandanna) ‘యానిమల్’ (Animal Movie) సినిమాలో కనిపించనుంది.

Rashmika Mandanna Animal Geethanjali.. గీతాంజలి.. బెంగాలీ ఛాయలతో.!

రష్మిక మండన్న (National Crush Rashmika Mandanna) ‘యానిమల్’ సినిమాలో బెంగాలీ బ్యూటీలా కనిపించబోతోందా.? అంతేనేమో.. అలాగే అనుకోవాలేమో.!

లుక్ అయితే అదిరింది.! ఈ సినిమాతో బాలీవుడ్‌లో నటిగా తన రేంజ్ అనూహ్యంగా పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది రష్మిక.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఒకే ఒక్క సినిమా.. సందీప్ రెడ్డి వంగా జీవితాన్ని మార్చేసింది. రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అదే ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy).

ఆ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Redddy) సినిమానే హిందీలోకి రీమేక్ చేసి, బాలీవుడ్‌లోనూ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తనదైన ముద్ర వేశాడు.

Also Read; కడుపు కోత.! ఏ తండ్రికీ రాకూడని కష్టమిది.!

ఇప్పుడిక ‘యానిమల్’ సినిమాతో ఎలాంటి ఇంపాక్ట్ సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేయబోతున్నాడోగానీ, నేషనల్ క్రష్ రష్మిక ఇమేజ్ మాత్రం.. ఈ స్టిల్‌తో డబుల్ అయిపోయింది.!

hellomudra

Related post