Trivikram Srinivas Samantha Writings.. అరరె.! ఎంత కష్టమొచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి.! తెలుగులో చేస్తుందో లేదోనన్న అనుమానంతో సమంత కోసం పాత్రలు రాయలేకపోతున్నారట.!
అదేంటీ, సమంత కోసం ఏదన్నా పాత్రని క్రియేట్ చేస్తే, ఆ పాత్రని చేయబోనని సమంత చెప్పే అవకాశం వుంటుందా.? అదీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అడిగితే.!?
‘అత్తారింటికి దారేది’, ‘అఆ’ తదితర సినిమాల్లో సమంత నటించింది.. ఆయా సినిమాల్లో సమంత కోసమే.. అన్నట్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన స్టయిల్లో మాటలు రాయడం చూశాం.
సమంత విషయానికొస్తే, ఏ పాత్రలో అయినా ఒదిగిపోతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అనారోగ్యం బారిన పడ్డాక సమంత, సినిమాల్లో నటించడం తగ్గించేసింది.
Trivikram Srinivas Samantha Writings.. సమంతతో సినిమా అంటే అంత వీజీ కాదిప్పుడు..
ఓ వెబ్ సిరీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది సమంత నుంచి. సినిమాల విషయానికొస్తే, ఒప్పుకున్న సినిమాలూ అనారోగ్యం వల్ల వదిలేసుకుంది సమంత.
అయితే, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న సమంత, తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమైంది. కానీ, సమంతని దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం అనేది ఈ మధ్యకాలంలో ఎందుకో తగ్గిపోయింది.

సమంత మార్కెట్ పడిపోవడం వల్లేనా.? అంటే, పూర్తిగా అదే కారణం.. అని కూడా చెప్పలేం. మళ్ళీ సమంత అనారోగ్యం బారిన పడితేనో.? అన్న అనుమానం దర్శక నిర్మాతల్లో వుంది.
ఒక్కటి మాత్రం నిజం.. సమంత అంటే ఫైటర్.! స్పెషల్ సాంగ్స్ దగ్గర్నుంచి యాక్షన్ గర్ల్ రోల్స్ వరకూ.. సమంత ఏదైనా చేసెయ్యగలదు.
Also Read: డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల: ఏదిరా నీ బాల్యం?
త్రివిక్రమ్ నిజంగానే సమంత కోసం మంచి మంచి కథలు, పాతల్రు సృష్టిస్తే, ‘నేను చెయ్యను’ అని సమంత చెప్పే పరిస్థితే వుండదు.!
బాలీవుడ్ నటి అలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి త్రివిక్రమ్, సమంతని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వ్యవహారమిది.