Nidhhi Agerwal Telugu States.. హీరోయిన్ నిధి అగర్వాల్, ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య షటిల్ సర్వీస్ చేస్తోంది.! అది కూడా ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో సందడి చేస్తోంది.
విషయం ఏంటంటే, నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులు చేస్తోంది. అందులో ఒకటి ‘హరి హర వీర మల్లు’ కాగా, మరొకటి ‘రాజా సాబ్’.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతోంది.
ఇంకోపక్క, తెలంగాణలో ‘రాజా సాబ్’ షూటింగ్ కూడా జరుగుతోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘రాజా సాబ్’.
Nidhhi Agerwal Telugu States.. అక్కడా.. ఇక్కడా.. డబుల్ ధమాకా.!
రెండు సినిమాలకు సంబంధించి ఒకే రోజు షూట్లో పాల్గొనాల్సి వస్తోంది నిధి అగర్వాల్‌కి. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Also Read: నారా రోహిత్ పెళ్ళికి ఈ ‘గ్రామ సింహాల’ హడావిడేంటి.?
నటిగా ఇదెంతో ప్రత్యేకమైన సందర్భం అనీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకే రోజు నటించడం.. చాలా ఆనందంగా వుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
పవన్ కళ్యాణ్ కోసం..
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్లో బిజీగా వున్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister), ఇంకో వైపు సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆయనకు అందుబాటులో విజయవాడ సమీపంలో భారీ సెట్ వేసి, అందులో ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరోపక్క, పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ కూడా పునఃప్రారంభమైంది. ఆ షూటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
