Table of Contents
ప్రముఖ తమిళ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిమానులకు ‘దీపావళి’ కానుక ఇస్తున్నట్లు ప్రమోషన్స్ సందర్భంగా చెప్పిన విజయ్, మాట నిలబెట్టుకున్నాడా? ఫస్ట్ రిపోర్ట్స్ ఏమంటున్నాయి? అభిమానులు సినిమా కోసం ఎలా సిద్ధమయ్యారు? వరుసగా డబ్బింగ్ సినిమాలతో డీలా పడిన కీర్తి సురేష్, ఈ సినిమాతో అయినా తిరిగి సూపర్ హిట్ అందుకుంటుందా? ‘స్పైడర్’ సినిమాతో షాక్ తిన్న మురుగదాస్ ‘సర్కార్’ సినిమాతో సత్తా చాటాడా? వివరాల్లోకి వెళదాం పదండిక.
ఫస్ట్ డే రిపోర్ట్స్ ఇలా వున్నాయ్..
గత కొద్ది రోజులుగా తమిళనాడులో ‘సర్కార్’ హవా నెలకొంది. దీన్నొక పొలిటికల్ థ్రిల్లర్‌గా సినిమా టీమ్ ప్రమోట్ చేస్తూ వచ్చింది. తమిళనాడులో రాజకీయాలు గత కొంతకాలంగా సూపర్ హీట్‌తో వున్నాయి. దాంతో ఈ పొలిటికల్ థ్రిల్లర్‌పై అంచనాలు బాగానే పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే, ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అనీ, సినిమా నిండా పొలిటికల్ సీన్స్ బాగానే వున్నాయనీ అంటున్నారు అభిమానులు. తమిళనాడుకి సరికొత్త రాజకీయ వెలుగు ‘దళపతి విజయ్’ అంటూ అభిమానులు నినదిస్తున్నారు.
మిక్స్డ్ టాక్..
‘సర్కార్’ సినిమాకి ఫస్ట్ డే రిపోర్టులు సూపర్ పాజిటివ్‌గా వచ్చేయడంలేదు. అభిమానులు ఊగిపోతున్నా, ఆ అభిమానుల్లోనే కొందరు, ‘విజయ్ స్టామినాకి తగ్గ సినిమా కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మురుగదాస్ ఇంకోసారి విఫలమయ్యాడనే ఆవేదన వారిలో కన్పిస్తోంది. అయితే విజయ్ మాత్రం కంప్లీట్ ఎనర్జీతో కన్పించాడనీ, ‘మెర్సల్’ కంటే పెద్ద విజయం ఈ ‘సర్కార్’ సాధించబోతోందని అభిమానులు లెక్కలు చెప్పేస్తున్నారు.
ఓపెనింగ్స్ అదుర్స్
అందరూ అంచనా వేసినట్లుగానే ‘సర్కార్’ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తమిళనాడులోనే కాక, ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర దేశాల్లోనూ బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ‘సర్కార్’ సాధించేసినట్లేనని వారు వెల్లడించారు. అయితే, కంప్లీట్ రిపోర్ట్స్ ఈ రోజు సాయంత్రానికి గానీ వచ్చే అవకాశం లేదు. విజయ్ స్టార్డమ్, సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైతే, ఆ అంచనాలే భారీ ఓపెనింగ్స్‌కి కారణం.
https://youtu.be/a2OXNuGPDcE?list=PLH4rVMDDprz9t0R4d_295wlhQWlN3TFwx
రామ్-లక్ష్మణ్ ఫైట్ సూపర్
సోషల్ మీడియాలో ‘సర్కార్’ (Sarkar) గురించి కన్పిస్తోన్న పోస్టింగ్స్‌లో ఎక్కువ భాగం, సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్‌ని కొనియాడుతూ వున్నవే. మన టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ఈ ఫైట్‌ని చాలా కొత్తగా కంపోజ్ చేశారంటూ ఆ పోస్టింగ్స్ దర్శనమిస్తున్నాయి. తెలుగులోనూ ‘సర్కార్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే విజయ్ సినిమాలకి తెలుగులో క్రేజ్ కాస్త తక్కువే. ‘మెర్సల్’ తమిళంలో సూపర్ హిట్ అయితే, అది ‘అదిరింది’గా తెలుగులో అంతగా రాణించలేకపోయింది.
కీర్తికి ఈసారైనా దక్కుతుందా?
కీర్తి సురేష్.. (Keerthy Suresh) మహానటిగా (Mahanati తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ, వరుస తమిళ సినిమాలతో పరాజయాల్నే చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ‘సర్కార్’ సినిమాపై ఆమె చాలా అంచనాలు పెట్టకుంది. ’పందెం కోడి‘ ఫర్వాలేదన్పించినా.. కీర్తికి ఆ సినిమాతో పెద్దగా ఒరిగిందేమీ లేదు. ’సర్కార్‘ సక్సెస్ అయితే మాత్రం, కీర్తి కెరీర్ మళ్ళీ పుంజుకున్నట్లే అవుతుంది.