Posani Krishna Murali Arrest.. సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, కథా రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. నిన్న హైద్రాబాద్‌లో ఆయన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వాస్తవానికి, అరెస్ట్ ఆలస్యమయ్యింది.! చాలాకాలం క్రితమే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయాల్సి వుంది. సభ్య సమాజంలో తిరగడానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తి పోసాని కృష్ణ మురళి.
వైసీపీ నేతగా వున్న సమయంలో, పోసాని కృష్ణ మురళి అత్యంత జుగుప్సాకరమైన రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థులపైన చేసేవారు.
రాజకీయ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు మామూలే కావొచ్చు.. కానీ, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని మహిళలు, చిన్న పిల్లల్ని సైతం బెదిరించేవారు తన జుగుప్సాకరమైన విమర్శలతో పోసాని.
సభ్య సమాజంలో స్వేచ్ఛగా తిరగడానికి అనర్హుడు..
చంద్రబాబు సతీమణి పైనా, పవన్ కళ్యాణ్ కుమార్తెలపైనా పోసాని కృష్ణ మురళి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు చాలానే వున్నాయ్ సోషల్ మీడియాలో.
మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆ వీడియోలు అందుబాటులోనే వున్నాయ్. అయినాగానీ, పోసాని కృష్ణ మురళి అనే మృగం, స్వేచ్ఛగా సభ్య సమాజంలో ఇన్నాళ్ళూ తిరిగింది.

సర్లే, ఇప్పటికైనా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారని.. అంతా ఊపిరి పీల్చుకుంటోంటే, వైసీపీ మాత్రం, ‘ఈ అరెస్టు అక్రమం’ అంటోంది. ఇదో పరమ రొటీన్ చెత్త డైలాగ్.
మొన్నామధ్యన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయితే, ‘అందగాడు కాబట్టే అరెస్ట్’ అంటూ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.
Posani Krishna Murali Arrest.. గ్లామరస్ అరెస్ట్..
‘చంద్రబాబు కంటే గ్లామరస్‌గా వుంటారు వల్లభనేని వంశీ.. అది నచ్చక, అక్రమంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు’ అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఆ కోణంలో చూస్తే, ఇప్పుడు పోసాని కృష్ణ మురళిని కూడా ‘అందగాడు’ అనే అనాలేమో.! ఇంకెంతమంది అందగాళ్ళున్నారో వైసీపీలో.! అన్నట్టు, వైఎస్ జగన్ గ్లామరస్‌గా చంద్రబాబుకి కనిపించలేదా.? ఏంటీ.?
Also Read: విశ్వక్ సేన్ క్షమాపణ.! ఇకపై ‘అసభ్యత’ వుండదట.!
రాజకీయం ఎలా దిగజారిపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
ఒక్కటి మాత్రం నిజం.. బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణ మురళి.. ఇలాంటి వాళ్ళు సభ్య సమాజంలో స్వేచ్ఛగా తిరగడానికి వీల్లేదు.
వాళ్ళకి స్వేచ్ఛనిస్తే, సమాజంలో మహిళలు, చిన్న పిల్లలకు రక్షణ వుండదు.. ఇది జనం మాట.!