Ritika Nayak Telugu Learning.. తెలుగులో మాట్లాడటమంటే కొందరు తెలుగమ్మాయిలకి నామోషీ.! ఈ మోడ్రన్ యుగంలో, మాతృ భాష దండగ.. అనేవాళ్ళు చాలామందే వున్నారు.
కానీ, కొందరు అలా కాదు.! ఇష్టంతో తెలుగు నేర్చుకుంటారు.! ఎంత కష్టమైనా సరే, తెలుగు నేర్చుకోవడంలో ఆసక్తి ప్రదర్శిస్తారు.
భాష వస్తే, నటనకు అది అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే, నటీనటులు వివిధ భాషల్ని నేర్చుకుంటుంటారు. అయినా, భాషతో ఏం పని నటనకి.? అనేవారూ లేకపోలేదు.
Ritika Nayak Telugu Learning.. తెలుగమ్మాయ్ కాకపోయినా..
రితిక నాయక్.. పలు తెలుగు సినిమాల్లో నటించింది. వాటిల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటివి వున్నాయి. ఈ బ్యూటీ దశ తిరిగింది.
హీరోయిన్ చెల్లెలు, ఫ్రెండ్ క్యారెక్టర్ల నుంచి.. హీరోయిన్ స్థాయికి ఎదిగింది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది రితిక నాయక్.

తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న ‘మిరాయ్’లో కూడా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నప్పుడు, తెలుగు నేర్చుకుంటే ఒకింత బావుంటుంది కదా.!
అందుకే, తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టింది. పుస్తకాలు చదవడం షురూ చేసింది. 30 రోజుల్లో ఆయా భాషలు నేర్చుకునేందుకు వీలుగా కొన్ని పుస్తకాలు అందుబాటులో వున్నాయ్ కదా.!
చక్కనమ్మ ఏం చేసినా..
అలాంటి, ఓ పుస్తకం చేత పట్టుకుని, ‘తెలుగు నేర్చుకుంటున్నాను.. మీరూ సాయం చేయండి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా క్యూటు క్యూటుగా ట్వీటేసింది రితికా నాయక్.

చక్కనమ్మ ఏం చేసినా అందమే.. అంటాడో కళా పోషకుడు.! నువ్వు తెలుగు నేర్చుకుంటానంటే.. మేం వద్దంటామా.? అని తెలుగు ఆడియన్స్ అంటారు మరి.!
Also Read: ఆమెకేమో ఇరవై.! అతనికేమో నలభై.!
అన్నట్టు, మమతా మోహన్ దాస్, నిత్యా మీనన్, రాశి ఖన్నా, ఆండ్రియా.. తదితరులు, తెలుగు సినిమాల్లో నటిస్తూ.. తెలుగు భాషని ఇష్టంగా నేర్చుకోవడమే కాదు, తెలుగులో పాటలు కూడా పాడేశారు.!
తెలుగుకి తెగులు పట్టించేలా తెలుగు పదాల్ని చిత్ర విచిత్రమైన వంకర్లు తిప్పే సోకాల్డ్ తెలుగు భామలు.. తమ మూలాల్ని మర్చిపోకుండా వుంటారని ఆశిద్దాం.