Table of Contents
వినయ విధేయ రామ.. టైటిల్ ఎంత కూల్‌గా వుందో కదా.! కానీ, ఇక్కడ రాముడు ‘కామ్’గా వుండే మంచి బాలుడు కాదు. పక్కా మాస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక్కడ. కొణిదెల సింహం.. పంజా దెబ్బ ఎలా వుంటుందో తెలుసా? అన్నట్టుంది టీజర్. అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి.
వరుస ప్రయోగాలు చేస్తూ వచ్చిన రామ్‌చరణ్ (Mega Power Star Ram Charan Tej), తనలోని పక్కా మాస్ కమర్షియల్ యాంగిల్‌ని బయటకు తీసుకొచ్చాడు. బోయపాటి శ్రీను అంటేనే సూపర్ మాస్. అలాంటి మాస్ డైరెక్టర్ క్లాస్ సినిమా టైటిల్ పెట్టినా, అతనిలోని మాస్ డైరెక్టర్ ఊరుకోడు కదా.! అదరగొట్టేస్తాడు.. అదరగొట్టేశాడు. ‘వినయ విధేయ రామ్’ టీజర్ (Vinaya Vidheya Ram Teaser) లో చరణ్‌ని పవర్‌ఫుల్‌గా చూపించేశాడు. అలా దూసుకొచ్చేశాడు ‘కొణిదెల రామ్’ (Konidela Ram).
చంపెయ్యాలా.? భయపెట్టాలా.?
ఆ డైలాగ్ డెలివరీ చూడు.. మెగా పవర్ స్టార్ ఎనర్జీ చూడు.! ఎన్ని సినిమాల్లో చెప్పుకున్నాం చరణ్ గురించి ఇలా.! ఇంకోసారి చరణ్ డైలాగులు చెబుతున్నప్పుడు అతనిలోని ఈజ్, అతని వాయిస్‌లోని పవర్ రెట్టింపయి కన్పించింది. ‘అన్నయ్యా.. వీడ్ని చంపెయ్యాలా, భయపెట్టాలా.?’ అని అడుగుతాడు కొణిదెల రామ్. ‘భయపెట్టాలంటే పది నిమిషాలు.. చంపేయాలంటే పావుగంట.. ఏదైనా ఓకే.. సెలక్ట్ చేస్కో..’ అంటూ చరణ్ చెప్పే డైలాగ్‌కి అప్పుడే విజిల్స్ పడిపోతున్నాయి అభిమానులకి.
మై హీరో రామ్‌చరణ్: సంపత్ నంది
చరణ్‌ని క్లాస్ టచ్‌తో వున్న మాస్ హీరోగా చూపించిన ఘనత సంపత్ నందికే (Sampath Nandi) దక్కుతుంది. ‘రచ్చ’ సినిమా విజువల్‌గా చాలా క్లాస్‌గా వుంటుంది. కానీ, చరణ్‌లోని మాస్ హీరోని సూపర్బ్‌గా ఎలివేట్ చేసింది. ఆ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది, చరణ్ కెరీర్‌లోనే ది బెస్ట్ లుక్ ఇచ్చాడనడం నిస్సందేహం. చరణ్ మీద సంపత్ నందికి ఎంత అభిమానం వుందో, టీజర్ చూశాక ‘మై హీరో’ అంటూ చరణ్‌ని సంబోదిస్తూ, ట్వీట్ చేయడాన్ని బట్టే అర్థమవుతుంది.
రామ్.. కొ.ణి.దె.ల.!
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఇంటి పేరు కొణిదెల. అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. అయినా, సినిమాల్లోకొచ్చాక ‘చిరంజీవి’గానే పేరు స్థిరపడిపోయింది. ‘కొణిదెల చిరంజీవి’ తనయుడిగా, సినీ వారసత్వాన్ని అంది పుచ్చుకున్న కొణిదెల రామ్ చరణ్ తేజ్.. ఇప్పుడు ‘కొణిదెల రామ్’ పాత్రలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. బోయపాటి బహుశా రియల్ లైఫ్‌లో చరణ్‌ని చూసి, ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) అని పేరు పెట్టి వుంటాడు. అవును మరి, చరణ్ అంటే వినయం.. చరణ్ అంటే, తండ్రి చిరంజీవికి విధేయుడని.! పేరు ఎలాగూ రామ్ చరణ్ కదా.! అలా వినయ విధేయ రామ అని పెట్టి వుండొచ్చు.
పందెం పరశురామ్ అయితే ఏంట్రా.!
విలన్‌కి వార్నింగ్ ఇచ్చే క్రమంలో కొణిదెల రామ్, తన పేరు గురించి చెబుతున్నాడు. అది టీజర్‌కే హైలైట్ అయ్యింది. ‘నువ్వు పందెం పరశురామ్ అయితే నాకేంట్రా.. నేను కొ..ణి..దె..ల.. రామ్..’ అంటూ చరణ్ చెప్పే డైలాగ్‌కి బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. తమిళ నటుడు ప్రశాంత్, ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తుండడం మరో విశేషం. చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో డివివి దానయ్య (DVV Danayya) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.